ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 6 న దేవరకొండ లో న్యాయసేవల శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.బుధవారం నవంబరు 6వ తేదీన దేవరకొండలో అన్ని ప్రభుత్వ శాఖలతో నిర్వహించే న్యాయ సేవల శిబిరానికి కావాల్సిన ఏర్పాట్లు, సమన్వయం, సహకారములపై జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,జిల్లా న్యాయ సేవాది కార సంస్థ కార్యదర్శి జి.వేణు తో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయం లో తన చాంబర్ లో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమ ఏర్పాటు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని,ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు వాటి వలన ప్రజలకు కలిగే లబ్ది ఒకే వేదికపై అవగాహన కల్పించటమే కాక అదే వేదికపై సేవలు అందించేలా ఆన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సమావేశములో పాల్గొన్న జిల్లా అధికారులను ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి. వేణు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికీ రాజ్యాంగములో పొందుపరచిన హక్కుల ఫలాలు ప్రతీ ఒక్కరికీ అందేలా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కృషి చేయాలని దానిలో భాగంగ న్యాయ సేవల శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు, దీనికై ప్రతీ ప్రభుత్వ శాఖ స్టాల్ ఏర్పాటు చేసి ప్రజలకు ఆ శాఖ నుండి ఎటువంటి సేవలు ప్రజలకు అందుతున్నవో తెలియ చేస్తుందని దీనికై ఆయా శాఖలు సహకారం అందించాలని మరియు పాన్ ఇండియా న్యాయ సేవల అవగాహన కార్యక్రమాలు గ్రామాల్లో ఇప్పటికే నిర్వహిస్తున్నట్లు ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించటానికి మరింత సహకరించాలని కోరారు. కార్యక్రమములో అదనపు జిల్లా కలెక్టర్ వి. చంద్రశేఖర్, ఆన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
