నవంబర్ 8వ తేదీ నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు పోడు భూముల సర్వే నిర్వహణకు సిబ్బంది సమగ్ర అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

అక్టోబర్ 31, 2021..

ఆదివారం కొత్తగూడెం క్లబ్బులో మండల ప్రత్యేక అధికారులు, రెవిన్యూ, అటవీశాఖ అధికారులకు సర్వే నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జిల్లాస్థాయిలో చైర్మన్గాగా కలెక్టర్ ఉంటారని, ఐటిడిఏ పిఓ నోడల్ ఏజన్సీగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు, మండలస్థాయిలో తహసిల్దారులు, _యంపిడిఓలు, అటవీ అధికారులు, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, విఆర్డిఓలు సభ్యలుగా ఉంటారని చెప్పారు.. గ్రామసభ తీర్మానం ద్వారా అటవీ హక్కుల పరిరక్షణ కమిటి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. కమిటి ఏర్పాటు, సర్వే నిర్వహణ తీరు తెన్నుల గురించి అధికారులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్నో ఏళ్ల తరబడి ఉన్న పోడు సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలుతో సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని చెప్పారు. ప్రజల నుండి ప్రతి క్లెయిమ్ తీసుకోవాలని, తీసుకున్న క్లెయిమన్ను రిజిష్టరులో నమోదు చేసి అదే నెంబరు క్లెయిమ్పై వేయాలని చెప్పారు. సర్వే నిర్వహణకు 343 గ్రామ పంచాయతీలకు గాను 500 టీములు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అటవీ హక్కుల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు ప్రక్రియ 6వ తేదీ వరకు ఏర్పాటు చేయాలని, 8వ తేదీ నుండి క్లెయిమ్స్ స్వీకరణ హాబిటేషన్లు వారిగా స్వీకరించడం జరుగుతందని, 25వ తేదీలోగా పరిశీలన పూర్తి చేయు విధంగా కార్యాచరణ తయారు చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతం సూచించారు. క్లెయిమ్ స్వీకరణ తదుపరి తిరస్కరణకు గరైన క్లెయిమ్ దారునికి నోటీసులు జారీ చేయాలని చెప్పారు. క్లెయిమ్స్ పై ప్రతి రోజు నివేదికలు అందచేయాలని ఆయన స్పష్టం చేశారు. హాబిటేషన్లు వారిగా పోడు భూముల వివరాలు అటవీ అధికారుల వద్ద ఉన్నాయని, ఆ ప్రకారం క్లెయిమ్స్ స్వీకరణ చేయాలని ఆయన సూచించారు. వెరిఫికేషన్ ఫారాలు ఉచితంగా అందచేస్తామని, దానికి ప్రజలు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. వెరిఫికేషన్ ప్రక్రియలో గ్రామ పెద్దల వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు అటవీ హక్కుల కమిటీ ఛైర్మన్, కార్యదర్శులు ధృవీకరణ చేయాలని చెప్పారు. అటవీ హక్కుల కమిటి చేసిన సిఫారసులు ఆధారంగా | గ్రామ పంచాయతీ తీర్మానాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. క్లెయిమ్స్ నమోదు చేసిన రిజిష్టర్లు ఆయా మండల తహసిల్దార్ కార్యాలయాల్లో బద్రపరచాలని చెప్పారు. అనంతరం సర్వే నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీ అశోక్ చక్రవర్తి, ఆర్టీఓ స్వర్ణలత, మండల ప్రత్యే అధికారులు, తహసిల్దారులు, యంపిడిఓలు, అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post