నవ భారత నిర్మాణానికి కృషి చేస్తున్నామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

నవ భారత నిర్మాణానికి కృషి చేస్తున్నామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

నవ భారత నిర్మాణానికి కృషి చేస్తున్నామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం దేశ వ్యాప్తంగా ముద్ర కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందిన వీధి వ్యాపారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ కార్యక్రమాలలో పారదర్శకత పాటిస్తూ నేరుగా లబ్ధిదారుల ఖాతాకే డబ్బులు జమచేస్తూ జవాబుతారితనం పాటిస్తునామన్నారు. ముద్ర కార్యక్రమం క్రింద వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా, గ్యాస్ సదుపాయం అందరికి ఉన్నదా ? అని అడిగి తెలుసుకున్నారు. దేశంలోని అందరు ప్రజలకు వన్ – నేషన్ – వన్ రేషన్ కార్డు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కరోనా కష్టకాలంలో నిరుపేద ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు సరిగ్గా అందాయా అని వివరాలు అడిగారు. ఈ సందర్బంగా కోటి మంది రైతులకు పియం కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద రెండు వేల చొప్పున మొదటి విడతగా 10 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు జమ చేశారు. పెట్టుబడి సాయంగా రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా అందజేస్తున్నామని, . E-kyc సమస్య కారణంగా డబ్బులు రాని రైతులకు కూడా సమస్య పరిష్కారం అనంతరం డబ్బులు వారి ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు. పియం గరీబ్ కళ్యాణ్ యోజన తదితర పథకాలపై ప్రజలతో ప్రధానమంత్రి ముఖాముఖీ నిర్వహించారు.
కార్యక్రమం అనంతరం అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ జిల్లాలో ముద్ర కార్యక్రమం క్రింద 4,409 వీధి వ్యాపారులు తమ వ్యాపారాల అభివృద్ధి కోసం 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశామని అన్నారు. రెండవ విడతగా 1,854 మందిని గుర్తించి ఇప్పటి వరకు 393 మంది వీధివ్యారులకు రెండవ విడతగా 20 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించామన్నారు.
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ వేణుగోపాల్ రావు, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇందిర, కో ఆర్డినేటర్లు , మంది వీధి వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post