నాగర్ కర్నూల్ జిల్లాకు రాబోయే 2022-23 ఆర్ధిక సంవత్సరానికి రూ. 4660.08 కోట్ల రుణ ప్రణాళికను విడుదల చేసిన అదనపు కలెక్టర్ మను చౌదరి.

నాగర్ కర్నూల్ జిల్లాకు రాబోయే 2022-23 ఆర్ధిక సంవత్సరానికి రూ. 4660.08 కోట్ల రుణ ప్రణాళికను విడుదల చేసిన అదనపు కలెక్టర్ మను చౌదరి.

శనివారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో జరిగిన  జిల్లా స్థాయి బ్యాంకర్లు, అధికారుల సంప్రదింపులు / జిల్లా స్థాయి సమీక్షా  సమావేశానికి  అదనపు కలెక్టర్ మను చౌదరి అధ్యక్షత వహించారు.  ఈ సందర్భంగా నాబార్డ్ డి.డి.యం. నాగార్జున వచ్చే సంవత్సరం జిల్లాలో  రుణ ప్రణాళిక పుస్తకాన్ని అదనపు కలెక్టర్ చేతుల మీదుగా విడుదల చేయించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ వచ్చే ఆర్ధిక సంవత్సరంలో  జిల్లాలో 4660.08 కోట్ల రుణాలను  వివిధ బ్యాంకుల ద్వారా వివిధ పథకాల ద్వారా ప్రజలకు  రుణాలు అందించనున్నాయని తెలిపారు.  ఇందులో  వ్యవసాయ ఉత్పత్త్లి, నిర్వహణ మరియు మార్కెటింగ్ రంగానికి 2824.64 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు.   వ్యవసాయ మౌలిక సదుపాయాలు అయిన గోదాములు, కోల్డ్ స్తొరేజ్ తదితర వాటికి రూ. 105.76 కోట్లు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ కు 307.05 కోట్లు  విద్యా రుణాలు రూ . 13.60 కోట్లు,  గృహ రుణాలకు రూ.  83.30 ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.  50.25 కోట్ల రుణ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.  ఈ మొత్తాన్ని వివిధ బ్యాంకులు తమ లక్ష్యాలుగా నిర్దేశించుకొని వంద శాతం అచివేమేంట్ సాధించే విధంగా ప్రణాలికలు చేసుకోవాలని బ్యాన్కర్లను సూచించారు.   అంతకు ముందు సెప్టెంబర్, 2021 త్రైమాసిక లక్ష్యాల పై సమీక్షా నిర్వహిస్తూ వ్యవసాయ మౌలిక రంగాలకి నిర్దేశించుకున్న రుణ లక్ష్యాలను చేరుకోవడంలో బ్యాంకులు విఫలమౌతున్నాయని, సంబంధిత వ్యవసాయ అధికారుల సమన్వయంతో లబ్దిదారులకు అవగాహన కల్పించి లక్ష్యాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  నిర్నీత కాల రుణాలు సైతం 2597.97 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం   833.42 కోట్లు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు.  సంబంధిత  జిల్లా అధికారులు సైతం సమావేశానికి వచ్చే ముందు తమ శాఖకు సంబంధించిన ఎన్ని యూనిట్లు ఎ ఎ బ్యాంకు ద్వారా పెండింగ్ లో ఉన్నాయి ఏ  మండలాల్లో ఏ బ్యాంక్ సరిగా ఇవ్వడం లేదు అనే పూర్తి వివరాలతో రావాలని అప్పుడే సమావేశములో పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.   బ్యాంకర్లు సైతం తమ గణాంకాలు సరిగ్గా ఇవ్వడం లేదని కనీసం ఇక్కడికి వచ్చే ముందు నివేదికను సరిచేసుకోవాలని సూచించారు.  ఎం.ఎస్.ఎం.ఇ, ప్రదాన మంత్రి స్వనిధి యోజన వంటి పథకాల్లో తమకు కేటాయించిన యూనిట్లను వంద శాతం సాధించే విధంగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలన్నారు.  పై అధికారులతో సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని వారితో మాట్లాడి సమస్య సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.  సబ్సిడీ ఆధారిత రుణాలకు వచ్చిన దరఖాస్తులను బ్యాంకులు ఏళ్ల తరబడి తమవద్ద ఉంచుకోకుండా  రుణాలు మంజూరు చేయడమో లేదా తిరస్కరించడమో చేయాలి తప్ప వద్ద పెట్టుకోవద్దని తెలియజేసారు.  జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు  బ్యాంకు అధికారులతో సమన్వయము చేసుకుంటూ అర్హులకు పారదర్శకంగా రుణాలు అందే విధంగా చూడాలన్నారు.  అదే సమయంలో మొండి బకాయిలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో  లీడ్ బ్యాంక్ మానేజర్  కౌశల్,  అర.బి.ఐ యల్.డి.ఓ. విభవ్ వ్యాస్,  నాబార్డ్ డి.డి.యం.  నాగార్జున టి, యునియన్ బ్యాంక్ ఆర్.హెచ్. మహబూబ్నగర్ జి.ఎన్.వి. రమణ, ఇతర బ్యాంకు మేనేజర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post