నాగర్ కర్నూల్ జిల్లాలోని మద్యం షాపులకు లక్కీ డీప్ ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ జిల్లాలోని మద్యం షాపులకు లక్కీ డీప్ ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం సుఖజీవన్ రావ్ ఫంక్షన్ హాల్లొ జిల్లా ఎక్సైజ్ శాఖ ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ నిర్వహించగా జిల్లా కలెక్టర్ పారదర్శకంగా లక్కీ డీప్ లు తీసి షాపులను టెండరుదారులకు కేటాయించారు. మొత్తం 67 షాపులకు 1507 టెండర్లు రావడం జరిగింది. ఇందులో కల్వకుర్తి సర్కిల్ లోని షాప్ నెంబర్ 39 కి అత్యధికంగా 51 టెండర్లు వచ్చాయి. అచ్ఛంపేట మండలం తుర్కపల్లి లోని షాప్ నెం. 31, లింగాల లోని షాప్ నెంబర్ 63 కు 10 దరఖాస్తుల కంటే తక్కువ రావడంతో నిబంధనల ప్రకారం అతి స్వల్పంగా వచ్చిన టెండర్లుగా భావించి ఈ రెండు షాపులకు తర్వాత కేటాయింపు జరుగుతుందని పక్కకు పెట్టారు. మిగిలిన 65 షాపులకు ఉదయం నుండి టెండరు దారుల సమక్షంలో ఒక్కో షాపుకు టెండర్లు వేసిన వారి సమక్షలో వారికి టొకన్లు చూపిస్తూ అత్యంత పారదర్శకంగా లక్కీ డీప్ నిర్వహించారు. ఎక్సైజ్ సూపరిండెంట్ దత్తురాజ్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మద్య ఈ కేటాయింపు ప్రక్రియ సజావుగా ముగిసిందని కలెక్టర్ తెలిపారు.

Share This Post