నాగర్ కర్నూల్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.

త్రిక ప్రకటన


తేది: 28-9-2022
నాగర్ కర్నూల్ జిల్లా
తీరొక్క పువ్వులతో నాగర్ కర్నూల్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
ఈ నెల 24న బొడ్డెమ్మ బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు నాగర్ కర్నూలు జిల్లాలో రోజుకో శాఖ చొప్పున ప్రతి రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లొ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని మండలాల నుండి మహిళా సంఘాలు తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చుకొని అన్ని ఒకే దగ్గర చేరి బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. మహిళలందరు తమ బతుకమ్మలను ఒకరికంటే ఒకరు అందంగా పేర్చుకొని తేవడంలో పోటీపడ్డారు. అన్ని సంఘాల మహిళలు తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలా బతుకమ్మ ల చుట్టూ పాటల పై సంప్రదాయ నృత్యం చేస్తూ చూపరులను కనువిందు చేశారు.
పి.డి డి.ఆర్.డి.ఏ నర్సింగ్ రావు , మెప్మా మేనేజర్ రాజేష్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది, ఇతర అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
—————
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ జిల్లా ద్వారా జారీ.

Share This Post