నాగర్ దొడ్డి, గార్లపాడు, రేవులపల్లి, ఆర్ఆర్ సెంటర్ల పెండింగ్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులకు ఆదేశించారు.

నాగర్ దొడ్డి, గార్లపాడు, రేవులపల్లి, ఆర్ఆర్ సెంటర్ల పెండింగ్  పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులకు ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టరేట్  సమావేశ హాలులో ఆర్ఆర్ సెంటర్ల పెండింగ్  పనులు పునరావాస కేంద్రాల పనులపై నీటిపారుదల శాఖ రెవిన్యూ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  పునరావాస కేంద్రంలో ఇప్పటికే కొన్ని పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. రేవులపల్లి, నాగర్ దొడ్డి, గార్లపాడు, ర్యాలంపాడు పునరావాస కేంద్రాల పనులు ఎంతవరకు వచ్చాయని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఇళ్ల పట్టాల పంపిణీ ఉన్నదని త్వరలో పంపిణీ చేస్తూ పనులు ప్రారంభిస్తామని అధికారులు  తెలిపారు. లే అవుట్ ద్వారా ఆర్ఆర్ సెంటర్లలో రోడ్లు, డ్రైనేజీలు, భవనాల నిర్మాణం, విద్యుత్ ఏర్పాట్లు పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు.రేవులపల్లి పట్టాల పంపిణి గురించి తెలుసుకున్నారు. నగర్ దొడ్డి కి సంబంధించి  రెడీ గ వాటిని పంపిణి చేస్తాము, ఎవరైతే కొత్త వారికీ అడుగుతున్నరో ఎంక్వయిరీ చేసి పూర్తి డీటెయిల్ రిపోర్ట్ తెప్పించుకుంటామని అన్నారు.  పనులు పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ నివేదికలు పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్డిఓ రాములు, ఇ ఇ కాజా జుబేర్ అహ్మద్, రహీముద్దీన్, పాల్గొన్నారు….

———————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారిచే జారీ చేయబడినది.

Share This Post