పత్రికా ప్రకటన. తేది:28.01.2022, వనపర్తి.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహాలలో ఏవైనా సమస్యలు తలెత్తితే జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు.
శుక్రవారం నాగవరం గ్రామపంచాయతీలో బిసి వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. వసతి గృహంలో ఏర్పాటుచేసిన ఇంకుడు గుంతలను ఆమె పరిశీలించారు. నూతన జిల్లా కలెక్టరేట్ భవన సముదాయానికి సమీపంలో గల కేజీబీవీ విద్యాలయం నుండి వచ్చే మురుగునీటి సమస్యను పరిష్కరించాలని, ఇంకుడు గుంతలు నిర్మించాలని జియాలజిస్ట్ యుగంధర్ రెడ్డిని ఆమె ఆదేశించారు.
అనంతరం సమీకృత నూతన జిల్లా కలెక్టర్ భవన సముదాయాన్ని ఆమె సందర్శించి, ఆవరణలోని మొక్కలను, భవన సముదాయం నిర్వహణపై అధికారులకు జిల్లా కలెక్టర్ తగు సూచనలు అందజేశారు.
జిల్లా కలెక్టర్ వెంట జియాలజిస్ట్ యుగంధర్ రెడ్డి, అదనపు డి ఆర్ డి ఓ .పి. కృష్ణయ్య, ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, బిసి వసతి గృహ సంక్షేమ అధికారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.