నాగారం గ్రామం సందర్శించిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం —4
ఆదర్శ గ్రామంగా నిలిచిన నాగారం:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
• 50 కుటుంబాలకు 500 రాజశ్రీ కోడిపిల్లల పంపిణీ
• డ్రమ్ సీడర్, వెదజల్లె పద్దతితో అధిక వరి దిగుమతి
• చిరుధాన్యాలతో బిస్కెట్, బేకరి పదార్థాల తయారీ యూనిట్ ఏర్పాటు
• కృషి విజ్ఞాన్ కేంద్రం దత్తత తీసుకున్న నాగారం గ్రామాన్నీ సందర్శించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి , సెప్టెంబర్ 09 :
-. నూతన వ్యవసాయ పద్దతుల అమలులో నాగారం గ్రామం ఆదర్శంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అభినందించారు. గురువారం కృషి విజ్ఞాన్ కేంద్రం దత్తత తీసుకున్న మంథని మండలంలోని నాగారం గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. గ్రామంలో కృషి విజ్ఞాన్ కేంద్రం ద్వారా వచ్చిన మార్పులను పరిశీలించిన కలెక్టర్ వారిని అభినందించారు. 2 సంవత్సరాల క్రితం మంథని మండలంలోని నాగారం గ్రామాన్ని కృషి విజ్ఞాన్ కేంద్రం తెలంగాణ కోండా లక్ష్మణ్ బాపూజీ హర్టికల్చర్ యూనివర్సిటి వారు దత్తత తీసుకున్నారు. అనంతరం ఆ గ్రామంలో ఉన్న కమ్యూనిటి చెరువులో గడ్డి అధికంగా ఉండటంతో దాని నిర్మూలించేందుకు కేవికె వారు గడి చేపలు విడుదల చేయడంతో ప్రస్తుతం చెరువు మొత్తం శుభ్రం అయింది, దీనిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వారి కృషిని అభినందించారు. నాగారం గ్రామంలో డ్రమ సీడర్, వెదజల్లె పద్దతిని ఉపయోగించడం పట్ల రైతులకు అవగాహన కల్పించి, ప్రస్తుతం గ్రామంలోని 90 శాతం మంది రైతులు డ్రమ్ సీడర్, వెదజల్లె పద్దతిని వినియోగిస్తు వ్యవసాయ చేస్తున్నారని తెలిపారు. డ్రమ్ సీడర్, వెదజల్లె పద్దతి ద్వారా వరి సాగు వల్ల కలిగే లాభాలను కేవికే ప్రతినిధులు కలెక్టర్ కు వివరించారు. సాధారణ వ్యవసాయం కంటే తక్కువ సమయంలో పంట వస్తుందని, ఎకరానికి 6 వేల రుపాయల కూలీ ఖర్చు తగ్గుతుందని, ఎకరానికి 20 కిలోల విత్తనాలు ఆదా అవుతాయని, పంట దిగుబడి పెరుగుతుందని తెలిపారు డ్రమ్ సీడర్ 6 వేల రుపాయాలకు అందుబాటులొ ఉంటుందని, దీనితో 2 మనుషులతో రోజుకు 5 ఎకరాలకు వరి నాటు వేయవచ్చని తెలిపారు. వ్యవసాయ రంగంలో కేవికే చేసిన కృషిని ప్రత్యేక్షంగా పరిశీలించిన కలెక్టర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు డ్రమ్ సీడర్, వెజజల్లె పద్దతి సాగు పై మరింత విస్తృత స్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్విపాంచాలని, దానికి జిల్లా యంత్రాంగం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం నాగారం గ్రామంలో 50 కుటుంబాలకు కుటుంబానికి 10 చొప్పున మొత్తం 500 రాజశ్రీ కోడి పిల్లలను పంపీణీ చేసారు. నాగారం గ్రామంలో చిరుధాన్యాలతో బిస్కెట్, బేకరి పదార్థాలు తయారు చేసే విధంగా కేవికే, డిఆర్డిఎ వారు సంయుక్తంగా యూనిట్ ఏర్పాటు చేయాలని, దీనికి అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు నాగారం గ్రువంలో మంచి మార్పులు తీసుకొని వచ్చేందుకు కేవికే చేసిన కృషి ప్రశంసనీయమని కలెక్టర్ అన్నారు.

      జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి  శ్రీధర్,డాక్టర్ ఎ. శ్రీనివాస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్  కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి ఖిల్లా, బూడిద మల్లేశం సర్పంచ్ నాగారం గ్రామం, మంథని మండలం,ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులుతదితరులు ఈ సమావేశంలో  పాల్గోన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి గారిచే జారీచేయబడినది.

Share This Post