నాగార్జున సాగర్ నియోజక వర్గ పరిధి లో నంది కొండ,హాలియా మున్సిపాలిటీ ల్లో గుర్తించిన అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యత నిచ్చి వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు

గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల భగత్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ లతో కలిసి నియోజకవర్గం లో హాలియా,నందికొండ మున్సిపాలిటీ ల్లో చేపట్టిన,చేపట్టనున్న అభివృద్ధి పనుల పై మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారుల తో సమీక్షించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నందికొండ,హాలియా మున్సిపాలిటీ ల్లో ఇప్పటికే వెజ్,నాన్ వెజ్ సమీకృత మార్కెట్, వైకుంఠ ధామం ల నిర్మాణంకు స్థలం గుర్తించినట్లు,వెంటనే పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు.రెండు మున్సిపాలిటీ లలో డి.ఆర్.సి.సెంటర్ లు ఏర్పాటు పనులు కూడా చేపట్టాలని సూచించారు.నందికొండ లో మూత పడిన లైబ్రరీ,ఆడిటోరియం తిరిగి ఉపయోగం లోకి వచ్చేలా ఆధునీకరణ, పునరుద్దరణ పనులు చేపట్టాలని శాసన సభ్యులు నోముల భగత్ సూచించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లైబ్రరీ, ఆడి టోరియం ఆధునీ కరణ,పునరుద్ధరణ పనులు చేపట్టి ప్రజల సౌకర్యార్థం ఉపయోగం లోకి తీసుకు రావాలని,ఇందుకు ప్రతి పాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
టి.యు. ఎఫ్.ఐ. డి.సి.ద్వారా నందికొండ,హాలియా మున్సిపాలిటీ ల్లో వివిధ పనులకు ఒక్కొక్క మున్సిపాలిటీకి 10.కోట్ల నిధులు మంజూరు అయినట్లు వెల్లడించారు. ఈ నిధులతో చేపట్టే పనులపై సమావేశం లో చర్చించారు.
నంది కొండ మున్సిపాలిటీలో  బస్ స్టాండ్ అభివృద్ధి,బస్ బే లు,ఫోర్ లేన్ రోడ్డు,మీడియన్ లు,  బాల భవన్, లైబ్రరీ పనులు చేపట్టాలని సమావేశం లో నిర్ణయించారు.హాలియా మున్సిపాలిటీ లో పెద్ద నాళా లేదా ఆడి టోరియం,డిజిటల్ లైబ్రరీ పనులు చేపట్టాలని నిర్ణయించారు.ముఖ్యమంత్రి ప్రకటించిన స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద  నంది కొండ లో త్రాగు నీటి పథకం, షాదీ ఖానా,హాలియా లో రోడ్డు, డ్రైన్ పనులు,షాదీ ఖానా పనులు చేపట్టాలని సమావేశం లో చర్చించారు.టి.యు. ఎఫ్.ఐ. డి.సి.నిధులు,ముఖ్యమంత్రి రెండు మున్సిపాలిటీలకు ప్రకటించిన స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ కింద చేపట్టే పనుల పై మున్సిపల్, ఎన్. ఎస్.పి.,పబ్లిక్ హెల్త్,మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులు సోమవారం, మంగళవారం లలో  సర్వే చేసి పనులు  గుర్తించి ప్రతి పాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నంది కొండ,హాలియా మున్సిపాలిటీ లలో మున్సిపల్ ఇంజినీర్,టెక్నికల్ అధికారి,టి.పి.బి.ఓ పోస్ట్ లు మంజూరు కు మున్సిపల్ పరిపాలన, పట్టణ అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కి ప్రతి పాదనలు రూపొందించాలని మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు.ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ. కందుకూరి వెంకటేశ్వర్లు,ఈ ఈ సత్యనారాయణ, హాలియా మున్సిపల్ కమిషనర్ వేమా రెడ్డి, నంది కొండ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

.నాగార్జున సాగర్ నియోజక వర్గ పరిధి లో నంది కొండ,హాలియా మున్సిపాలిటీ ల్లో గుర్తించిన అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యత నిచ్చి వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు

Share This Post