నాటిన ప్రతిమొక్కను సంరక్షించాలి :: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 21: నాటిన మొక్కలను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. గురువారం జనగామ నుండి వడ్లకొండ రోడ్డులో బహుళ వరుసలలో నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణకు హరితాహారం కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలో జనగామ జిల్లాలో జాతీయ, రాష్ట్ర, జిల్లా,గ్రామీణ రహాదారులకు ఇరువైపులా బహుళ వరుసలో మొక్కలు నాటి పాదులలో చేసి ట్రీగార్డ్స్, కర్రలు, ఏర్పాటు చేసి నాటిన మొక్కలను నీరు పోసి సంరక్షించాలని కలెక్టర్ అన్నారు. గ్రామాలలో ఖాళీ ప్రదేశాలలో తెలంగాణాకు హరిత హారం కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా మొక్కలు నాటాల్సిన భాద్యత ఉందన్నారు.గ్రామాలలో నర్సరీలు, పల్లెప్రకృతి వనాలు, వైకుంట దామాలలో గ్రామ పంచాయతీ, పాటశాలల అవరణాలలో మొక్కలు నాటి కాపాడితే పల్లెలు పచ్చగా ఉండి వర్షాలు అధికంగా కురిసి అవకాశo ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ జి.రాంరెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ.మహేందర్, జనగామ ఎం.పి.డి.ఓ. బి.హిమబిందు,ఎంపిఓ సంపత్ కుమార్ ఎపిఓ భిక్షపతి, స్థానిక సర్పంచ్ బొల్లం శారద, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
——————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post