నాణ్యతతో పనులు చేయాలి…

ప్రచురణార్ధం

నాణ్యతతో పనులు చేయాలి…

మహబూబాబాద్, అక్టోబరు,29.

సఖి సెంటర్ నిర్మాణపనులు నాణ్యతతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శుక్రవారం పట్టణంలో పర్యటించి సఖి సెంటర్ నిర్వహణ తీరు, బాలసదనం సౌకర్యాల ఏర్పాటు, బాల రక్షభావన్ పనితీరు, కొత్తగా నిర్మించిన సఖి సెంటర్ భవనం పనులను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.

సఖి సెంటర్ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు. బాలరక్ష భవనం నిర్వహణ తీరును పరిశీలిస్తూ బాల్య వివాహాలు అరికట్టాలని, వివాహాలు నిలిపి వేసిన వారు ఏమి చేస్తున్నారో పర్యవేక్షించాలన్నారు. బాలల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 1098 హెల్ప్ లైన్ ప్రచారం చేపట్టాలన్నారు.

గ్రామస్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి మహిళ ప్రజాప్రతినిధులు, అధికారులను పాల్గొనేలా చేసి హక్కులపై మహిళలకు అవగాహన పరచాలన్నారు. హెల్ప్ లైన్ 181 ప్రాధాన్యతను తెలుపాలన్నారు.

బాలల సధనంను బి.సి.సంక్షేమ వసతి గృహంలో ఏర్పాటు చేసుకోవాలన్నారు.

కలెక్టర్ వెంట జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిణి స్వర్ణలత లెనినా,పంచాయతీ రాజ్ ఈ ఈ సురేష్, బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ నాగవాణి, సి.డి.పి.ఓ. డెబోరా,సఖి సెంటర్ నిర్వహకులు శ్రావణి, బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post