నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వరి ని మాత్రమే కొనుగోలు సెంటర్లకు తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ అన్నారు.

పత్రిక ప్రకటన                                                     తేది: 21-12-2021

నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వరి ని మాత్రమే కొనుగోలు సెంటర్లకు తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ అన్నారు.

మంగళవారం  గద్వాల్ మండలం లత్తి పురం, రేకుల పల్లి గ్రామాలలో ఉన్న ఐ కె పి  వరి కొనుగోలు కేంద్రాలను  పరిశీలించారు.  ధాన్యం నాణ్యత విషయంలో రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండి  ప్రత్యేకించి 17 శాతం కంటే  ఎక్కువ  తేమ  ఉండకుండా చూసుకోవాలని రైతులకు తెలిపారు. దాన్యం  లో  తేమ శాతం పరిశీలించిన తరవాతే ధాన్యం సేకరణ చేయాలని  అన్నారు.  ముఖ్యంగా వరి లో  తేమ శాతం  ఎక్కువగా ఉండకూడదని,  ప్రతిరోజు కొనుగోలు చేసిన దాన్యాన్ని  అదేరోజు రైస్ మిల్లులకు  లారీల ద్వారా పంపించాలని, రైస్ మిల్లర్లు  ట్యాప్ ద్వారా అన్ లైన్ లో నమోదు చేసి, రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలని తెలిపారు. రైతుల బ్యాంకు అకౌంట్ , ఆదార్, పట్టాధారు పాస్ పుస్తకం , ఫోన్ నెంబర్, ఓ.టి.పి ద్వారానే  కొనుగోలు జరుగుతుందని అన్నారు.  ఆన్లైన్ లో క్రాప్ బుకింగ్ చేసేటపుడు రైతు మొబైల్ నెంబర్ కు వచ్చిన  ఓ.టి.పి చెక్ చేయాలనీ అన్నారు.

అదనపు కలెక్టర్ గారితో పాటు డి.ఎస్.ఓ రేవతి, అడిషనల్ డి.ఆర్.డి.ఎ సరోజ, శ్రీధర్ గౌడ్,  తదితరులు పాల్గొన్నారు.

————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చె జారి చేయబడినది.

 

 

 

 

Share This Post