నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలి…

ప్రచురణార్థం

నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలి…

మహబూబాబాద్ డిసెంబర్ 8.

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ శశాంక రైతులకు విజ్ఞప్తి చేశారు.

బుధవారం కలెక్టర్ నర్సింహులపేట మండలం పడమటి గూడెం నర్సింహులపేట గ్రామాలలో పర్యటించి ఆరుతడి పంటలను ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు నాణ్యమైన ధాన్యాన్ని విక్రయించగా గలిగితే మిల్లులో ధాన్యం కోత ఉండదని తెలియజెప్పారు.

రైతులు తేమశాతం 17 తో ధాన్యాన్ని విక్రయించు కునేందుకు టోకెన్ పొందాలని సూచించారు ధాన్యం విక్రయించిన తర్వాత ధాన్యాన్ని రవాణా తో పాటు మిల్లులకు చేర్చే బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మాత్రమే బాధ్యత తీసుకోవాలన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయని టార్పాలిన్ కూడా ఏర్పాటు చేశామన్నారు.

మాయిశ్చర్ మీటర్లు ద్వారా తేమశాతం పరిశీలించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదే రోజు రవాణా చేపట్టే విధంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు దగ్గరగా ఉన్న మిల్లులకు ట్రాక్టర్ల ద్వారా దూరంగా ఉన్న మిల్లులకు లారీల ద్వారా రవాణా చేయించాలన్నారు.

అనంతరం నరసింహుల పేట మండలం పడమటి గూడెం గ్రామం వద్ద వేరుశనగ పంటను అదే మండలంలో పచ్చ జొన్న, రామన్నగూడెం వద్ద బొప్పాయి పంట ను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు రైతులతో పంట సాగు తీరును అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ సమ్మెట రాము వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి మండల కో-ఆర్డినేటర్ మల్లారెడ్డి తాసిల్దార్ ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు
————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post