నాణ్యమైన పత్తి, వారి ధాన్యానికి మద్దతు ధర వివరాలు ప్రకటించిన వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్

వానాకాలం 2021-22 పత్తి తేమ 8 శాంతం ఉండి పొడవు పింజ రకానికి రూ.6025/- పింజ రకానికి (మేచ్.) కు రూ.5,925/- కనీస మద్దతు ధర లభిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలియజేసినారు.
ఈరోజు తన ఛాంబర్లో పత్తి మరియు వారి ధాన్యం కొనిగోలు మద్దతు ధర తెలిపే గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తేమ శాంతం తగ్గితే 9% నికి రూ.5964.75నుండి రూ. 5865.75,
తేమ 10 శాంతం ఉంటే రూ. 5904.50 నుండి 5806.50, 11% ఉంటేరూ.5844.25 నుండి రూ. 5747.25, అలాగే తేమ 12% ఉన్నట్లయితే రూ.5784/- నుండి రూ. 5688/- అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పత్తి తేమ శాంతం 6 నుండి 7 శాంతం ఉన్నట్లయితే సీసీఐ వారు బోనస్ కూడా చెల్లిస్తారని 6% తేమకు పొడవు పింజార రకానికి రూ.120.50, నుండి పింజర రకానికి రూ.118.50 అదనంగా ఇవ్వబడుతుందని తెలియజేసినారు. 7% తేమకు రూ.60.25 లు నుండి 59.25 వరకు చెల్లిస్తరన్నారు.
అలాగే వారి ధాన్యం సాధారణ రకానికి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.1,940/- గ్రేడ్ ఏ రకానికి రూ. 1,960/- అందించడం జరుగుతుందని తెలియజేసినారు. మక్కలకు రూ. 1870/- కందులు రూ. 6300/-, పెసలు రూ.7275/- వేరుషనగా రూ. 5550/- మినుములు రూ. 6300/- పొద్దుతిరుగుడు (సన్ ఫ్లవర్ ) 6015/- సోయబీన్ రూ. 3950/- నువ్వులు రూ.7307/- నిగర్ విత్తనాలు 6930/- జొన్నలు – హైబ్రీడ్ 2738/- జొన్నలు – మాలదండీ రూ.2758/- సజ్జలు రూ. 2250/- రాగులు రూ.3377/-మద్దతు ధర లభిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ తెలియజేసినారు.
రైతులు పండించిన సరుకులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రపరచి, ఎండబెట్టి మార్కెట్ యర్డులకు, కొనుగోలు కేంద్రాలకు తీసుకోరావాలన్నారు. రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డ్ లలో వ్యవసాయ ఉత్పత్తులను శుభ్రపరుచుటకు పాడి క్లీనర్, తేమ కొలిచే యంత్రాలు, ఎలక్ట్రానిక్ కంటాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసినారు. నాణ్యమైన పత్తి, వ్యవసాయ ఉత్పత్తులను తెచ్చి మద్దతు ధర పొందాలని రైతులను జిల్లా అదనపు కలెక్టర్ కోరారు.

Share This Post