నాణ్యమైన మట్టి వినాయక విగ్రహాలు మార్కెట్ లో ఆకట్టుకునే విధంగా మన జిల్లా నుండే ఉత్పత్తి కావాలని అందుకు జిల్లాలోని కుమ్మరి కులస్తులకు తగిన సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు.

పత్రికా ప్రకటన
తేది: 9-9-2021
నాగర్ కర్నూల్ జిల్లా
నాణ్యమైన మట్టి వినాయక విగ్రహాలు మార్కెట్ లో ఆకట్టుకునే విధంగా మన జిల్లా నుండే ఉత్పత్తి కావాలని అందుకు జిల్లాలోని కుమ్మరి కులస్తులకు తగిన సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. గురువారం ఉదయం జిల్లా బి.సి. సంక్షేమ శాఖా అధ్వర్యంలో కుమ్మరి కులస్థుల సంఘం తరపున జిల్లా కలెక్టరుకు మట్టి గణేష్ విగ్రహాన్ని బహూకరించారు. ఐ సందర్భంగా కలెక్టర్ విగ్రహ నిర్మాణం, మార్కెట్ లో గిరాకి తదితర అంశాల పై సంఘ నాయకులతో చర్చించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజస్థాన్ నుండి వచ్చి ఇక్కడి నాణ్యమైన విగ్రహాలు తయారు చేసి సొమ్ము చేసుకున్తునారని, అలాంటప్పుడు ఇక్కడ మీరెందుకు తయారు చేయలక పోతున్నారని అడిగారు. ముందుగ నాణ్యమైన ఇసుక లేని మట్టిని సిద్ధం చేసుకువాలని ఇందుకు పల్వరైజేషణ్ యంత్రం దొరుకుతుందన్నారు. పది నుండి పదిహేను లక్షల వ్యయం తో దొరికే ఈ యంత్రాన్ని కొంత మంది కల్సి తెచ్చుకుంటే కొన్ని కుటుంబాలు ఉపాధి పొందుతారని సలహా ఇచ్చారు. ఒక ప్రణాళిక తాయారు చేసుకొని బ్యాంకు వద్దకు వెళితే రుణ సదుపాయం సైతం దొరుకుతుందన్నారు. అవసమైతే జిల్లా యంత్రాంగం ద్వారా అవసరమైన సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. మట్టిని యంత్రం ద్వారా మెత్తగా చేసుకొని విగ్రహాలు, టి కప్పులు, మంచి నీళ్ళ బాటిల్, పూల తోట్టెలు మంచి ఆకర్శనీయంగ తయారు చేయవచ్చని సూచించారు. ప్రస్తుతం మార్కెట్ లో వీటికి మంచి గిరాకి ఉంటుందని మార్కెట్ ను ఆకట్టుకునే విధంగా వస్తువులు మట్టితో తాయారు చేయాలనీ తెలిపారు. వచ్చే సంక్రాంతికి మీ ద్వారా తాయారు చేసిన మట్టి టి కప్పును నాకు బహుమతిగా ఇవ్వాలని కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్న కుమ్మరి సంఘ అధ్యక్షుడు రఘు బాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లాలో 8 అంగుళాల సైజులో వెయ్యి వినాయక విగ్రహాలను మట్టితో తాయారు చేయడం జరిగిందని, వీటిని నాగర్ కర్నూల్ మున్సిపాలిటికి 400, అచ్చంపేటకు 200 కొల్లాపూర్ కు 200 కల్వకుర్తి మున్సిపాలిటికీ 200 చొప్పున అందజేయడం జరిగిందన్నారు. తమరి సహకారంతో తాము సైతం మట్టి తో నాణ్యమైన వస్తువులను తాయారు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బి.సి. సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, సంఘం అధ్యక్షుడు వురుకొండ రఘు బాబు, ఉపాధ్యక్షుడు జంగయ్య, సంఘం సభ్యులు సుల్తాన్, రాములు, మల్లేష్, అర్జున్ ఆంజనేయులు నరసింహ తదితరులు పాల్గొన్నారు.
—————————
జిల్లా పౌర సంబంధాల అధికారి నాగర్ కర్నూల్ ద్వారా జారి.

Share This Post