నాణ్యమైన, శుభ్రమైన వరి ధాన్యమును కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలి- అదనపు కలెక్టర్ తిరుపతి రావు

నాణ్యమైన, శుభ్రమైన వరి ధాన్యమును కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ తిరుపతి రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధ్యక్షతన వరి ధాన్యము కొనుగోలు పై వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లై అధికారులు, ధాన్యము కొనుగోలు కేంద్రాల అసోసియేషన్స్, రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేయడం జరిగినది.

ఈ సందర్భాంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో వాన కాలంలో వరి ధాన్యం లక్ష 70 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా, అందుకు తగినట్లుగా కొనుగోలు కేంద్రాలలో ఏర్పాట్లు చేయాలనీ, ధాన్యం కు అవసరమైన గన్ని బ్యాగులను సిద్ధంగా ఉంచాలని, రైతులు పండించిన పంటను శుభ్రం చేసి, తేమ లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే విదంగా రైతు వేదికల ద్వారా అవగహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యంను తీసుకొని వచ్చిన రైతుల వివరాలు ఆన్ లైన్ లో ఖచ్చితంగా నమోదు చేసి టోకెన్ ఇవ్వాలని కొనుగోలు కేంద్రాల వారికి సుంచించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అందరు కలిసి సమిష్టిగా పని చేయాలని సంబంధిత అధికారులను, ధాన్యం కొనుగోలు కేంద్రాల వారిని, రైస్ మిల్లర్లకు సుంచించారు.

జిల్లా రైతు వేదిక సమన్వయ సమితి చైర్మన్ వెంకటలక్ష్మా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతులు పండించిన ధాన్యం శుభ్రంగా,తేమ లేకుండా తీసుకురావాలని వ్యవసాయ అధికారులు రైతులకు అవగహన కల్పించి వారు ఇబ్బందులు పడకుండా అధికారులు, కొనుగోలు కేంద్రాల వారు కలిసి పని చేయాలనీ అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీత, మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయా దేవి, సివిల్ సప్లై అధికారులు మనోహర్ రాథోడ్, శ్యామా లక్ష్మి, కొనుగోలు కేంద్రాల అసోసియేషన్స్ ఛైర్మన్స్, రైస్ మిల్లరులు , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post