నామినేషన్ల పరిశీలన అనంతరం పోటీలో ఐదుగురు అభ్యర్థులు – ఎన్నికల అధికారి హరీష్

నామినేషన్ల పరిశీలన అనంతరం పోటీలో ఐదుగురు అభ్యర్థులు – ఎన్నికల అధికారి హరీష్

స్థానిక సంస్థల నియోజక వర్గ మెదక్ శాసన మండలి సభ్యుని ఎన్నికకు సాధారణ ఎన్నికల పరిశీలకులుగా నియమింపబడిన సహకార శాఖ కమీషనర్ ఏం. వీరబ్రహ్మయ్య (ఐ.ఏ.ఎస్) సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీష్ బుధవారం నాడు కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో నామినేషన్ పత్రాలను పరిశీలించారు. ఇట్టి స్థానిక సంస్థల నియోజక వర్గ శాసన మండలికి ఏడుగురు అభ్యర్థులు (13) సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా సహాయ ఎన్నికల అధికారి రమేష్, పార్టీ అభ్యర్థులు, ప్రతినిధుల సమక్షంలో నామినేషన్ పత్రాలను పరిశీలించి ఎన్నికల నియమావళి లోని చెక్ లిస్ట్ ప్రకారం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన బోయిన విజయలక్ష్మి, సాయిబాబా చింతల, మట్ట మల్లా రెడ్డి, టి.ఆర్.ఎస్. అభ్యర్థి ఒంటరి యాదవ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి టి.నిర్మల లు వేసిన నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నాయని ధ్రువీకరించారు. కాగా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన ప్రవీణ్ కుమార్ , ఐరేని సత్యనారాయణ గౌడ్ ల నామినేషన్ పత్రాలు ఎన్నికల నియమావళి మేరకు సరిగ్గా లేనందున తిరస్కరించామని ఆయన తెలిపారు. నామినేషన్ల పరిశీలన అనంతరం పోటీలో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల అధికారి హరీష్ తెలిపారు.

Share This Post