DPRO ADB – నామినేషన్ ల ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్యెల్సీ స్థానానికి 22 మంది అభ్యర్థులు తమ నామినేషన్ లను ఉపసంహరించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. నామినేషన్ ల ఉపసంహరణ చివరి రోజైన శుక్రవారం రోజున మధ్యాహ్నం 3 గంటల వరకు ఉప సంహరణ పత్రాలను కలెక్టర్ స్వీకరించారు. నామినేషన్ ల పరిశీలన అనంతరం 24 అభ్యర్థులు ఉండగా, మొదటి రోజున ఒక్కరు, రెండవ రోజున ఐదుగురు, మూడవ రోజున 16 మంది అభ్యర్థులు నామినేషన్ లు ఉప సంహరించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్యెల్సీ స్థానానికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి విట్టల్ దండె, స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పరాణి లు పోటీ లో ఉన్నట్లు కలెక్టర్ ప్రకటన జారీ చేశారు. ఈ కార్యక్రమం లో సహాయ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post