నాయి బ్రాహ్మణ, రజక వృత్తిదారులకు సెలూన్, దోబీ ఘాట్ లు, లాండ్రీ దుకాణములు నడిపేందుకు గారు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కోనం దరఖాన్తు చేనుకునేందుకు ప్రత్యేక డైవ్ నిర్వహిన్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం నమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల నంక్షేమ అధికారి కె.నత్యనారాయణ రెడ్డితో కలిని నాయి (బ్రాహ్మణ, రజక కులన్తులతో పథకంపై నమీక్ష నిర్వహించారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం కోనం గతంలో దరఖాన్తు చేనుకున్నవారు వివరాలు తప్పుగా నమోదు చేసినట్లయితే మార్చు చేర్చులకు ఎడిట్ అవకాశం కల్పించడం జరిగిందని, జిల్లాలోని రజకులకు, నాయి బ్రాహ్మణులకు వాణిజ్య విద్యుత్ కనెక్షన్ లేకపోయినట్లయితే ప్రభుత్వమే నూతన కనెక్షన్ కల్పించనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని రజక, నాయి బ్రాహ్మణులు అందరూ మీ సేవా కేంద్రాలలో ఆన్‌లైన్‌లో దరఖాన్తు చేనుకోవాలని, అట్టి ప్రతులను జిల్లా వెనుకబడిన తరగతుల నంక్షేమ అధికారి కార్యాలయంలో అందజేయాలని, ఈ అవకాశాన్ని అర్హత గల వారు నద్వినియోగం చేనుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ, రజక కులన్తులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.