నాయి బ్రాహ్మణ, రజక వృత్తిదారులకు సెలూన్, దోబీ ఘాట్ లు, లాండ్రీ దుకాణములు నడిపేందుకు గా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టి విన్ఫృత ప్రచారం నిర్వహించడం జరిగిందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా నజీమ్ అలీ అప్పర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నాయి బ్రాహ్మణ, రజక వృత్తి దారులకు మరొకసారి అవకాశం కల్పించడం జరిగిందని, అర్హత గల వారు ఆన్లైన్లో దరఖాన్తు చేనుకోవాలని తెలిపారు. మీసేవ నుండి పొందిన కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, నంబంధిత షాప్ ఫోటో తో పాటు నంబంధిత ధ్రువపత్రాల తో దరఖాన్తు చేనుకోవాలని తెలిపారు. సొంతంగా/ వేరుగా ఎలక్ట్రిక్ కలెక్షన్ లేనివారు నూతన నర్వీన్ కనెక్షన్ కొరకు దరఖాన్తు చేనుకోవాలని, ఒకటి కంటే ఎక్కువ నర్వీన్ మీటర్లు ఉన్నచో కేవలం ఒక్క మీటరుకే ఈ పథకం వర్తిన్తుందని, ఈ విద్యుత్తును ఇతర పనులకు వినియోగించకూడదని, విద్యుత్ కనెక్షన్ లబ్బిదారుని పేరు మీదుగా ఉండాలని, అద్దెషాప్లో ఉన్నట్లయితే లీజు అగ్రిమెంట్ నమర్చించాలని, విద్యుత్ వినియోగం 250 యూనిట్లు మించితే అట్టి డబ్బులను లబ్బిదారులు చెల్లించాల్సి ఉంటుందని, ఈ అవకాశాన్ని ఆనక్తి అర్హత గల వారు నద్వినియోగం చేనుకోవాలని తెలిపారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.