నాయీ బ్రాహ్మణులకు, రజకులు ఉచిత విద్యుత్ కనెక్షన్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు

ప్రెస్ రిలీజ్. తేది 09.08.2021 నాయీ బ్రాహ్మణులకు, రజకులు ఉచిత విద్యుత్ కనెక్షన్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. దోబీ ఘాట్, లాండ్రీ షాప్, సెలూన్ ల కోసం విద్యుత్ కనెక్షన్ కావాలంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని కోరారు. ఇప్పటివరకు కు ఆరు వందల ఇరవై నాలుగు మంది లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పారు. వీటిని అధికారులు పరిశీలించి విద్యుత్ కనెక్షన్లు ఇస్తారని చెప్పారు. ప్రభుత్వం లబ్ధిదారులకు 250 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తోందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా బి.సి.సంక్షేమ అధికారి శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి ని సునంద, ట్రాన్స్కో ఈ ఈ శేషారావు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy

Share This Post