నారాయణపురం ఆరు సర్వే నెంబర్లలో గల అర్హులైన రైతులు ధరణి ద్వారా పట్టాదారు పాసు పుస్తకాల జారికై మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలి…..

నారాయణపురం ఆరు సర్వే నెంబర్లలో గల అర్హులైన రైతులు ధరణి ద్వారా పట్టాదారు పాసు పుస్తకాల జారికై మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలి…..

ప్రచురణార్థం

నారాయణపురం ఆరు సర్వే నెంబర్లలో గల అర్హులైన రైతులు ధరణి ద్వారా పట్టాదారు పాసు పుస్తకాల జారికై మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలి…..

మహబూబాబాద్, జూన్ -01:

నారాయణపురం 6 సర్వేనెంబర్ లో గల అర్హులైన రైతులు ధరణి ద్వారా పట్టాదారు పాసు పుస్తకాలు పొందుటకు మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

బుధవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి నారాయణ పురం గ్రామం ప్రజా ప్రతినిధులు, రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.

మంత్రి మాట్లాడుతూ, నారాయణపురం భూముల విషయమై దళారులను ఆశ్రయించి మోసపోరాదని, ఆరు సర్వే నంబర్ లలోని అర్హులైన రైతులు ధరణి ద్వారా పట్టదార్ పాస్ పుస్తకాలు పొందుటకు మీ సేవలో నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అంశాల వారీగా తెలపాలని సూచించారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ, 2016 సంవత్సరంలో ప్రభుత్వం నారాయణపురం రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేసి, 2018 సంవత్సరంలో గెజిట్ ద్వారా నారాయణ పురం గ్రామం నందు మొత్తం సర్వే నెంబర్లు 43 లో 21 పట్టా నెంబర్ లు గా, 22 సర్వే నెంబర్లు ఫారెస్ట్ వెంచర్లు గా నెల్లికుదురు మండలం లోని చిన్న ముప్పారం గ్రామం నుండి విభజించి కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపురం రెవెన్యూ గ్రామమునకు బదిలీ చేయడం జరిగినది అని, 2018 సంవత్సరంలో భూ ప్రక్షాళన కార్యక్రమంలో 22 సర్వే నంబర్ భూములు 1605.09 ఎకరాలు ఫారెస్ట్ భూములుగా గతంలో ప్రకటించబడినందున ఆ భూముల్లో సేద్యం చేస్తున్న సుమారు 900 మంది రైతులు కొత్త పట్టా దార్ పాస్ పుస్తకాలు జారీ కాబడలేదని, ఇట్టి విషయంలో సర్వే నంబర్ లను dis-reserve గా రాష్ట్ర ప్రభుత్వం చేసినందున అట్టి భూములకు సంబంధించి రికార్డులను సేకరించి, tahasil కార్యాలయంలో ఉన్న రికార్డ్ లను క్రోడీకరించి సమగ్ర నివేదికను భూ పరిపాలన అధికారి కార్యాలయం హైదరాబాదుకు పంపగా, ధరణి పోర్టల్ లో మొదటి దఫాగా నారాయణపురం గ్రామం కి సంబంధించి వివరాలను పొందు పరచడం జరిగిందన్నారు. అర్హులైన రైతులు పాత పాస్ పుస్తకం కలిగిన, పహానిలో నమోదు అయిన, ఎంజాయి మెంట్ నందు మొఖా కాస్తూ చేయుచున్న రైతులు మీ సేవలో తగిన దస్తావేజులు జతచేసి రుసుము చెల్లించి దరఖాస్తు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేసముద్రం నెల్లికుదురు సర్పంచులు, ఎంపిటిసి లు, గ్రామ పెద్దలు, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో కొమురయ్య, ఏ.డి. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, తహసీల్దార్లు మండల సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post