నారాయణపేట ఇసుక నారాయణపేట ప్రజలే వినియోగించుకోవాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ హాల్ లో స్యాండ్ కమిటీ సమావేశం జరిగింది. అక్రమ ఇసుక తాలింపు అరికట్టి నారాయణపేట ఇసుక నారాయణపేట ప్రజలే వినియోగించుకొనేటట్లు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా ను అరికట్టాల్సిన చర్యల పై కమిటీ సభ్యులతో చర్చించరు. జిల్లా లో ప్రస్తుత నడుస్తున్న రిచుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీజ్ అయిన ఇసుకను మన ఊరు మన బడి కి కావలసిన ఇసుకను తరలించడానికి ఇచ్చే బాధ్యత తఃసిల్దార్లదే అన్నారు. అక్రమంగా తరలించిన టిప్పర్, ట్రాక్టర్ సీజ్ చేసిన తరువాత ఆ ఇసుకను డంప్ చేసుకొని వారికి ఫైన్ వేయాలన్నారు. ఆన్లైన్ లో ఇసుక కోసం అప్లై చేసుకున్న వారికి తరలించేటప్పుడు ట్రాక్టర్ కు కు GPRS ఉండాలని, ట్రాక్టర్ వివరాలను తప్పని సరిగా నమోదు చెసుకోవలన్నారు. ఒకే పర్మిషన్ తో ఎక్కువ గా ఇసుక తరలించన చో వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రిచ్ ల దగ్గర CC కెమెరాలను అమార్చలన్నారు. ఇసుక అక్రమ రవాణా ను అరికట్టడానికి తీసుకోవలసిన చర్య ల పై ఎక్కడైనా అవసరం ఉన్న చోట చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ ల సహకారం తో ఇసుక అక్రమ రవాణాను అరికట్టలన్నారు.
ఈ సమావేశం లో జిల్లా ఎస్పీ యన్ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ పద్మజా రాణి adమైనస్,డిపిఓ మురళి, eerws,ee ఇరిగేషన్ అధికారులు, మక్తల్, మగానూర్, మద్దూర్, ఊట్కూరు తహశీల్దార్లు ఏవో నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.