నారాయణపేట చీరలకు ఖ్యాతి పెరుగుతోంది…జిల్లా కలెక్టర్ డి హరిచందన

నారాయణపేట చీరలకు ఖ్యాతి పెరుగుతోంది…జిల్లా కలెక్టర్ డి హరిచందన

ప్రస్తుత మార్కెట్ కు కనుగుణంగా చేనేత చీరల ఉత్పత్తులు‌ జరగాలని కలెక్టర్ హరి చందన నేత కార్మికులకు సూచించారు.చేనేత, జౌళి శాఖ అద్వర్యంలో చేనేత దినోత్సవం సందర్భంగా సింగారం చౌరస్తాలోని నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  ప్రారంభిచిన చేనేత భీమా నేతన్నకు ధిమ కార్యక్రమంతో నారాయణపేట చీరలకు ఖ్యాతి పెరుగోతుందని మహిళా జిల్లా పాలనా అధికారులు అందరు చేనేత చీరలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని జిల్లా కలెక్టర్ డి హరిచందన పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం చేనేత కార్మికుల అభివృద్ధికి చాల కార్యక్రమాలు చేపట్టిందని మీరు తయారు చేసే వాటిని డిజైనర్ల ద్వారా మార్పులు చేయడం జరుగుతోందన్నారు. మీరు తాయారు చేసిన చీరలకు మార్కెటింగ్ కై  ఎక్కడో మాడల్స్ ద్వారా పరిచయం చేయడం జరగదని ఇక్కడ తాయారు చేసిన చీరలను ఇక్కడి వారి ద్వారానే నారాయణపేట చీరల పై ఫోటో శుట్స్,  డాక్యుమెంటరీ తయారు చేయడం జరుగుతోందన్నారు. వాటితో మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందన్నారు. కొత్త రకపు చీరలను తయారు చేయాలనీ చేనేత శాఖ అద్వర్యం లో జిల్లాలో రెండు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటుచేశామన్నారు. ధన్వాడలో కొత్త ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.లూమ్స్ లో కొత్త రక మైన వాటిని పరిచయం చేయాలన్నారు.లూమ్ టెక్నికల్ గా మార్చితే కొత్త రకమైన వాటిని తయారు చేసుకోవచాన్నారు. చేనేత శాఖలో లూమ్స్ లకు రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  అరుణ్యను ప్రత్యేకంగా చేనేత కార్మికులకై ప్రారంభించడం జరిగిందని అరుణ్య ద్వారా కలంకారి,బ్లాక్ పైంటింగ్,ఇతర రకాల డిజైన్లతో చీరలను తయారు చేయడం జరిగిందన్నారు. ఎగ్జిబిషన్లో  నారాయణపేట చీరలను పరిచయం చేయడం జరిగినదాన్ని ఓ చేనేత కార్మికుడు తయారు చేసినవాటిని తానే స్వయంగా చీరపై కలంకారి,బ్లాక్ పైంటింగ్ వేసుకొనే టట్లు వేసులు  బాటు ఇస్తూ జిల్లాలో కలంకారి బ్లాక్ పైంటింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు.చేనేత కార్మికుల అభిరుద్దికై కృషి చేస్తామన్నరు.

నారాయణపేట శాసన సబ్యులు యస్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపేట చేనేత కు,బంగారానికి చాల  ప్రధాన్యత ఉండేదని అప్పటి ఘన చరిత్ర  రాను రాను మాసకబరిందాన్ని వాటిని మల్లి నారాయణపేట చేనేతకు ప్రాముఖ్యతను ప్రాధాన్యతను తిసుకరావాలని ఇప్పటి అభిరుచులు అనుగుణంగా ఆలోచన చేసి ప్రణాళిక ప్రకారంగా నారాయణపేట చేనేతకు ఓ బ్రాండ్ అంబసేటార్ గా ఎలా మార్కెట్ చేయాలని అలోచించి జిల్లా కలెక్టర్ డి హరిచందన  చేనేత కార్మికులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.  స్మిత అగర్వాల్ గారు నారాయణపేట చీరలకు ప్రాధాన్యత ఇవ్వడం చాల సంతోసకరం అన్నారు.  చేరలే కాకుండా మగవారికి కూడా అనువైన చేనేత వస్త్రలను తాయారు చేయాలన్నారు.చేనేత  రంగం కనుమర్గు అవుతున్న తరుణంలో  తెలంగాణా ప్రభుత్వం  చేనేతకు ప్రాధాన్యత ఇస్తుందని అందులో భాగంగానే చేనేత ఆస్తులను కూడా కాపాడుకోవాల్సిన భాత్యత తమపై ఉందన్నారు.చేనేత సొసైటి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా జిల్లా కలెక్టర్ గారితో కలిసి అది చేనేత కార్మికులకే కాపాడగాల్గామన్నారు. ధన్వాడలో డిజైనింగ్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కేంద్రంలో 6 కోట్ల రూపాయలతో అత్యదునిక తతో వివర్స్ వివింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని త్వరలో నిర్మించి ప్రారంభిస్తామన్నారు. నారాయణపేటలో చేనేత కళను దేశం మొత్తంలోనే మారు మోగే విధంగా చర్యలు చేపడతామన్నారు.ఈ రోజు నుంచి నేతన్నకు చేయూత రైతు బందులాగా చేనేత భీమాను ఏర్పాటు చేయడం చాల అభినందనీయం అన్నారు.ప్రతి ఒక్క చేనేత కార్మికుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు ప్రత్యేక చోరువ చూపి అంద్ఫారి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలని చేయించని తరుణం లో శాఖా పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతదన్నారు. చేనేత కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొంటు ఇష్టంతో చేనేతను చాల ఇష్టంగా భావించి చేనేత రంగాన్ని ముందుకు తీసుకొని వేల్తురన్నారు.

అనంతరం చేనేత కార్మికుల ద్వారా తయారు చేసిన ఓ వీడియోను వీక్షించి, చేనేత వస్త్రాల వినియోగం వాటి ప్రాముక్యత అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటిల్లో విజేతలకు ప్రశంశ పత్రాలు,మేమొట్లతో సత్కరించారు.అనంతరం చేనేత కార్మికుల ద్వారా తయారు చేసిన ఓ వీడియోను వీక్షించి, చేనేత వస్త్రాల వినియోగం వాటి ప్రాముక్యత అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటిల్లో విజేతలకు ప్రశంశ పత్రాలు,మేమొట్లతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో  అడిషనల్ కలెక్టర్ పద్మజ రాని, ఆర్డీఓ రామచందర్ మున్సిపల్ చైర్పర్సన్ గండే అనసుయ్య చంద్రకాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ హరినరయన్భాట్టాద్, జిల్లా చేనేత మరియు జౌళి శాఖా అధికారులు చంద్ర శేఖర్ చేనేత కార్మిక సంఘాల అద్య్క్షకులు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. లు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబందల అధికారి ద్వార జారి.

Share This Post