నారాయణపేట జిల్లాలో రవాణా శాఖ కార్యాలయం ప్రారంభం కావడంతో జిల్లాకు TS 38 అనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు

నారాయణపేట జిల్లాలో రవాణా శాఖ కార్యాలయం ప్రారంభం కావడంతో జిల్లాకు TS 38 అనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  శుక్రవారం సాయంత్రం జిల్లాలో నూతన రవాణా శాఖ కార్యాలయాన్ని జడ్పి చైర్మన్ వనజమ్మ, స్థానిక శాసన సభ్యులు యస్. రాజేందర్ రెడ్డి, మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తో కలిసి ప్రారభోత్సవం చేసారు.  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం రాక ముందు ఆ తర్వాత జిల్లాగా ఏర్పడి ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. జిల్లాలో నేడు ప్రారంభించిన రవాణా శాఖ కార్యాలయం జిల్లాలో త్వరలోనే స్వంత కార్యాలయం నిర్మించుకొని అక్కడికి బదిలీ చేయడం జరుగుతుందన్నారు. నారాయణపేట జిల్లాకు ముందు నుంచి చిరలకు, బంగారానికి ప్రత్యేక గుర్తింపు ఉందని ఈ గుర్తింపును దేశ వ్యాప్తంగా పేరు వచ్చేవిధంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.  ఇక్కడ టెక్స్ టైల్, బంగారు, వ్యాపార రంగులో బహుళార్థ వ్యాపార రంగాలను తీసుకురానున్నట్లు తెలియజేసారు.   జిల్లాలోని ప్రతి ఎకరం భూమికి సాగు నీరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుండి ఇచ్చేందుకు పనులు వేగవంతంగా కొనసాగుతున్నదన్నారు.  ఈ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేవని అందుకే జిల్లాకు పక్కన ఉన్న ఇతర రాష్ట్రాల సరిహద్దు ప్రాంత వాసులు తమను తెలంగాణా రాష్ట్రంలో కలుపుకోవాల్సిందిగా కోరుచున్నారన్నారు. తెలంగాణా రాష్ట్రంలో అన్ని కులాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.  ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన వాటిని పట్టించుకోకుండా అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలియజేసారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు యస్. రాజేందర్ రెడ్డి మాటకడుతూ జిల్లాలో రవాణా శాఖ కార్యాలయం లేనప్పుడు ఇక్కడి ప్రజలు ఏ వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకోవలన్నా 60 కిలోమీటర్ల దూరం వెళ్లి చేయించుకోవాల్సి వచ్చేదని ప్రజలు ఇబ్బంది పడేవారన్నారు.  ఇక నుండి ఇక్కడే రిజిస్టేషన్లు అవుతాయని తద్వారా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న వాహన షోరూం వారికీ సైతం ప్రోత్సాహం లభిస్తుందన్నారు.   ప్రస్తుతం అద్దె భవనంలో ప్రారంభించిన కార్యాలయాన్ని త్వరలోనే స్వంత కార్యాలయం నిర్మించి అక్కడికి మార్చడం జరుగుతుందన్నారు.  జిల్లా ఏర్పడ్డాక ఒకొక్కటిగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటూ అభివృద్ధి వైపు బాటలు వేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణ పేట జిల్లాను మంజూరు చేశాక ఇప్పటి వరకు ఒక్కక్కటిగా అన్ని కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.  ప్రజలు ఆత్మస్థైర్యం ఒక నమ్మకంతో ఉండాలని రాబోయే రోజుల్లో జిల్లాను అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు.  రవాణా శాఖ కార్యాలయం ఏర్పాటుతో జిల్లాకుబెప్రత్యేక గుర్తింపు వచ్చిందని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా.చేతన,   మున్సిపల్ చైర్మన్ జి. అనసూయ, గ్రంథాలయ చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టాడ్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి వీర స్వామి, జడ్పిటీసీలు, ఎంపిపిలు అధికారులు తదితరులు పాల్గొన్నారు

Share This Post