నారాయణపేట జిల్లాలో వంద పడకల చిన్న పిల్లల మొడులాస్ ఆసుపత్రిని ప్రారంభించిన రాష్ట్ర ఐ.టి పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్.

వేల్స్ ఫార్గో ఆర్థిక సహాకారంతో  యునైటెడ్ వే హైదరాబాద్, బెంగళూరు స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మొడులాస్ స్టార్టప్ వారు  100 పడకల చిన్న పిల్లల ఆసుపత్రిని నిర్మించి ఇచ్చినందుకు జిల్లా ప్రజల తరపున వారికి స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.  గురువారం మధ్యాహ్నం స్థానిక వీర సావర్కర్ కూడలిలో ప్రభుత్వ ఆసుపత్రికి  జోడింపుగా   ఏర్పాటు చేసిన మొడులాస్ 100 పడకల ఆసుపత్రికి తెలంగాణ రాష్ట్ర ఐ.టి.పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గందే అనసూయ, వేల్స్ ఫార్గో ప్రతినిధి శ్రీధర్ చండూరి, యునైటెడ్ వే బెంగళూరు ప్రతినిధి రాజేష్ కృష్ణన్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జులై 11వ తేదీన రాష్ట్ర మున్సిపల్ మరియు ఐ.టి శాఖ మంత్రి కే.తారక రామారావు నారాయణపేట జిల్లా సందర్శన సందర్బంగా కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే చిన్న పిల్లల పై తీవ్ర ప్రభావం ఉంటుందని, జిల్లా కర్ణాటకకు అంచున హైదరాబాద్, మహబూబ్ నగర్ కు దూరంగా ఉందని కోవిడ్ తీవ్రతను తట్టుకోవడం తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని చర్చించుకోవడం జరిగిందన్నారు.  రాబోయే ప్రమాదాన్ని అరికట్టడానికి  వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తే బాగుంటుందని ప్రణాళికలు చేసుకోవడం జరిగిందన్నారు.  అనుకున్నదే తడవుగా జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ప్రత్యేక చొరవ తీసుకొని  ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ తో మాట్లాడటం జరిగిందని,   ప్రిన్సిపల్ సెక్రటరీ అందుకు అంగీకరించి యునైటెడ్ వే ఆఫ్ బెంగళూరు స్వచ్చంద సంస్థతో మాట్లాడి వేల్స్ ఫార్గో ద్వారా రూ. 4.20 కోట్ల వ్యయంతో ఈ 100 పడకల చిన్న పిల్లల ఆసుపత్రిని 100 రోజుల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  మద్రాస్ ఐఐటీ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి స్టార్టప్ పెట్టిన మొడులాస్  సి.ఈ.ఓ మొత్తం ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు.  అందుకు ప్రిన్స్ పల్ సెక్రెటరిని జిల్లా కలెక్టర్ ను ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.  ఇక ఎటువంటి వైద్య ఇబ్బందులు ఎదురైన సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా సిద్ధంగా ఉందని, ఈ జిల్లా తో పాటు ఇతర జిల్లాల నుండి వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించే స్థాయికి ఎడిగామని ధైర్యంగా భరోసా కల్పించారు.  ఇప్పటికే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పిడియాట్రిక్ వైద్యులు ఉన్నారని అదనంగా మరో ఇద్దరు చిన్న పిల్లల వైద్యులను, సరిపడా నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని పొరుగు సేవల సిబ్బంది ద్వారా నియామకం జరిపి ఈ ఆసుపత్రిలో పూర్తి స్థాయి సిబ్బందితో వైద్య సేవలు అందించే విధంగా తనవంతు కృషి చేయాలని ప్రిన్సిపల్ సెక్రెటరిని కోరారు.  ఈ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని భరోసా కల్పించారు.

జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ థర్డ్ వేవ్ లో చిన్న పిల్లలకు కోవిడ్ వస్తే ఎలా తట్టుకోవాలి ఎటువంటి ఏర్పాట్లు అవసరం అనే విషయాలపై శాసన సభ్యులతో చర్చించి కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే సమయానికి వంద పడకల చిన్న పిల్లల ఆసుపత్రి సిద్ధం చేయాలి అని సంకల్పంతో ఐ.టి.శాఖ ప్రినిపల్ సెక్రెటరీ సహకారం, వేల్స్ ఫార్గో దాతృత్వం, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, బెంగళూరు వారి సహకారంతో జిల్లాలో తక్కువ సమయంలో వంద పడకల ఆసుపత్రి సిద్దం చేయడం జరిగిందన్నారు.  ఈ ఆసుపత్రి ఏర్పాటులో సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా వేల్స్ ఫార్గో యాజమాన్యానికి జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదాలు తెలిపారు.  ఈ ఆసుపత్రిలో ఐసోలేషన్ బెడ్లు, నేటాల్ బెడ్స్  తదితర అన్ని మౌళిక సదుపాయాలతో కూడుకున్నదని తెలిపారు.

పార్లమెంట్ సభ్యుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ పట్టణానికి దూరంగా కర్ణాటక రాష్ట్ర బార్డర్ లో ఉన్న ఈ జిల్లాకు మొదులాస్ ఆసుపత్రి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.  శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ చొరవ ముందస్తు ప్రణాళికతో రాష్టములో ఎక్కడ లేని విధంగా అన్ని మౌళిక సదుపాయాలతో ఈ చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు.  రబోయ్ రోజుల్లో జిల్లాను మరింత అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు.

యునైటెడ్ వే ఆఫ్ బెంగళూర్ ప్రతినిధి రాజేష్ కృష్ణన్ మాట్లాడుతూ నారాయణపేట జిల్లా గ్రామీణ ప్రజలకు అన్ని మౌళిక సదుపాయాలతో కూడిన వంద పడకల ఆసుపత్రిని వేల్స్ ఫార్గో, తమ యునైటెడ్ వే ఆఫ్ బెంగుళూరు ద్వారా నిర్మించి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని  అన్నారు.  వేల్స్ ఫార్గో లాంటి ఇతర పారిశ్రామి సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యతలు నిర్వర్తించేందుకు ముందుకు రావాలని ముఖ్యంగా వైద్య సేవల రంగంలో మౌళిక సదుపాయాలు మరిన్ని కల్పించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  ఈ ఆసుపత్రిని జిల్లాకు అప్పగిస్తున్నామని దీనిని జాగ్రత్తగా చూసుకొని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, జిల్లా ప్రజలపై ఉందని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, మున్సిపల్ చైర్మన్ గందే అనసూయ, అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి, ఆసుపత్రి సూపరిండెంట్ మల్లికార్జున్, ఆర్.డి.ఓ వెంకటేశ్వర్లు, మొదులాస్ స్టార్టప్ సి.ఈ.ఓ శ్రీరామ్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post