నారాయణపేట జిల్లాలో సమీకృత వ్యవసాయాభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, వీటికి అనుగుణంగా రైతులను చైతన్య పరచాల్సిందిగా వ్యవసాయ అనుబంద శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఆదేశించారు

నారాయణపేట జిల్లాలో సమీకృత వ్యవసాయాభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, వీటికి అనుగుణంగా రైతులను చైతన్య పరచాల్సిందిగా  వ్యవసాయ అనుబంద  శాఖ అధికారులను  జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఆదేశించారు.  సోమవారం టేలికాన్ఫెరేన్స్ ద్వారా జిల్లాలో  వ్యవసాయ రంగం అభివృద్ధి పై వ్యవసాయ, ఉద్యానవనం, పౌల్ట్రీ, ఫిషరీస్ వంటి అనుబంధ  శాఖాదికారులతో పాటు పాలెం వ్యవసాయ కేంద్రం  శాస్త్రవేత్తలతో సమీక్షా నిర్వహించారు.  పాలెం వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్ర వేత్తలతో నారాయణపేట జిల్లాలో  సమీకృత వ్యవసాయ అభివృద్ధికై ఉన్న అవకాశాలను, మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను అడిగి తెలుసుకున్నారు.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేవలం వరి, కూరగాయల సాగు మాత్రమే కాకుండా జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు పుష్కలమైన అవకాహలున్నయన్నారు.  చిన్న సన్నకారు రైతులు పౌల్ట్రీ , చేపలు, రొయ్యల పెంపకం, ఆయుర్వేద మొక్కల సాగు వంటి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. దీనికొరకు ముందుగ వ్యవసాయ విస్తీర్నాధికారులు, మండల వ్యవసాయ అధికారులను శిక్షణ, అవగాహన కల్పించాలని, అనంతరం రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటల  సాగుకు శిక్షణ ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారిని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను సైతం అవగాహన కల్పించి వివిధ రకాలైన ఉత్పత్తుల వైపు ప్రోత్సహించాలని సూచించారు.  జిల్లాలో సాగు నీటికి కొదవ లేదని అలాంటి చోట వరి పంటకు బదులు చిన్న చిన్న కుంటలు ఏర్పాటు చేసుకొని అందులో చేపలు, రొయ్యలు సాగు చేసుకోవచ్చన్నారు.  పౌల్ట్రి కి మంచి డిమాండు ఉందని దానితో పాటు మంచి లాభాలు ఉన్నాయన్నారు. బ్యాంకర్లతో మాట్లాడి    రైతులకు అవసరమైన వ్యవసాయ రుణాలను ఉదారంగా ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ అధికారిని ఆదేశించారు.  శిక్షణ కార్యక్రమాలకై రైతు వేదికలను వినియోగించుకోవాలని, వచ్చే యాసంగి నుండి జిల్లాలో ఒకేరకమైన పంట సాగు కాకుండా సమీకృత పంటల సాగు అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ  అనుబంధ శాఖలదే అని ఆదేశించారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, పాలెం డాట్ సెంటర్ శాస్త్ర వేత్త డా. రామకృష్ణ బాబు, మదనాపూర్ కే.వి.కే సురేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసన్న కుమార్, ఉద్యాన శాఖ అధికారి వెంకటేశ్వర్లు, పశు సంవర్థక శాఖ అధికారి అబ్దుల్  రషీద్ తో పాటు కొంతమంది రైతులు పాల్గొన్నారు. 

Share This Post