పత్రిక ప్రకటన
నారాయణపేట జిల్లా
తేది:07-08-2021
నారాయణపేట జిల్లా చేనేత చీరలకు చాల ప్రాముఖ్యత ఉన్నదని జిల్లా కలెక్టర్ డి హరిచందన అన్నారు. శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అంబేద్కర్ కూడలి నుండి జౌళ్లి శాఖ అద్వర్యం లో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీను కలెక్టర్ జండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ లో మహిళలు ద్విచక్ర వాహన లపై నారాయణపేట చీరలను ధరించి వీరసవర్కర్ చౌరస్తా మీదుగా ఆర్డీఓ కార్యాలయనికి చేరుకొవడం జరిగింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నారాయణపేట జిల్లా చేనేత చీరలు పెట్టింది పేరు అన్నారు. ఇక్కడ నేసిన చిరలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. ఈ సందర్బంగా చేనేత కార్మికులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
చేనేత కార్మికులకు కేంద్ర రాష్ట ప్రభుత్వలు చాల పతకాలను ప్రవేశపెట్టడం జరిగిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దేశం లో నారాయణపేట జిల్లా చీరలకు చాల ప్రఖ్యాతి ఉన్నదని తెలంగాణా రాష్టం లో సిరిసిల్ల తరువాత ప్రోడేచ్షణ్ సెంటర్, మార్కెటింగ్ సౌకర్యం, ట్రైనింగ్ సెంటర్ లు నారాయణపేట లో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. చేనేత కార్మికులు స్వహహగా వ్యాపారం చేసుకోవడానికి ముద్ర స్కీం ద్వార లోన్ లు తీసుకోవచ్చని సూచించారు. శ్రీనిధి ద్వార చేనేత కార్మికులకు మగ్గాలు పెట్టుకోవడాని కి ట్రెనింగ్ పొందడానికి ఈ ఇస్కిం ద్వార పొందవచ్చని స్థలము లేనివారు ఉంటె చిన్న కాప్రటివే గా ఏర్పడి ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. కరోనా సమయం లో పొదుపు పతాకాన్ని కర్మిక్కులకు అనుగుణంగా ముందుగానే విడుదల చేయడం జరిగినదాన్ని పొదుపు పతాకాన్ని వినోయోగించుకోవాలని సూచించారు. నాణ్యమైన చీరాల తయారికి సంబందిత అధికారుల సలహా తీసుకోవచ్చని మార్కెటింగ్ కై DRDO అరుణ్య ఆన్లైన్ ద్వార విక్రయాలకు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగిందని సూచించారు. టేస్కో ద్వార ట్రైనింగ్ ను ఇవ్వడం జరుగుతోందని ట్రైనింగ్ లో పాల్గొన్న వారికీ దాదాపు 200 రూపాయలు ఇవ్వడం జరుగుతోందని సూచించారు. అందరు ఓకే విధంగా డిజైన్ కాకుండా తితర రకాల చేరాలను తాయారు చేయాలనీ సూచించారు. సమావేశం లో ముద్ర స్కీం ద్వార రుణాల చెక్కులను పంపిణి చేసి చేనేతకర్మికులకు సన్మనం చేయడం జరిగింది.
అనంతరం సమావేశం లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ చిత్రపటానికి పులమలవేసి జ్యోతి ప్రజ్యలన చేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ చంద్ర రెడ్డి, జిల్లా అధికారులు గోపాల్ నాయక్, లియాఖాత్ అల్లి, జిల్లా చేనేత జౌల్లి అభిరుద్ది శాఖా అధికారి చంద్ర శేకర్, మున్సిపల్ చైర్పర్సన్ గందే అనసుయ్య చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.