నారాయణపేట జిల్లా భూగర్భ జలవనరుల అంచన నివేదికను ఈరోజు జిల్లా కలెక్టర్ డి హరిచందన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భజలాల అంచనాల ప్రకారo వినియోగం 43% శాతము గా ఉన్నది. ధన్వాడ, కోస్గి మరియు మరికల్ మండలంలో భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉందని, రాబోయే వర్షాకాలంలో పెద్దఎత్తున వాన నీటి సంరక్షణ పద్ధతులు పాటిస్తూ పొలాల్లో ఉన్న ఎండిపోయిన బావులు మరియు బోరు బావుల లోనికి వాన నీటిని పంపించి భూగర్భ జలాలను వృద్ధి చేయవలసిందిగా మరియు పట్టణాల్లో ఇంకుడుగుంతలు చేపట్టవల్సిందిగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలను కోరలు. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు సూచించారు
ఈ కార్యక్రమం లో భూగర్భ జలశాఖ డిడి యం.రాజేందర్ కుమార్, కె రవి కుమార్ అసిస్టెంట్ హైడ్రోలియజిస్ట్, యస్. చైతన్య కుమార్ సినియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.