నారాయణపేట జిల్లా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2021 బుక్ మరియు పిడుగుపాటు కు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డి హరిచందన ఆవిష్కరించారు

నారాయణపేట జిల్లా హ్యాండ్ బుక్ ఆఫ్  స్టాటిస్టిక్స్ 2021 బుక్  మరియు పిడుగుపాటు కు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డి హరిచందన  ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు తో కలిసి సమావేశ మందిరంలో జిల్లా హ్యాండ్ బుక్  ఆఫ్ స్టాటిస్టిక్స్ లో జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, చేనేత చీరల వివరాలు వర్షపాతం వివరాలు మరియు జనాభా వివరాలు వ్యవసాయం పంట వివరాలు విద్య వైద్య మరియు పరిశ్రమల వివరాలు తెలుసుకున్నందుకుగాను ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నందున పిడుగుపాటు గురికాకుండా రైతులు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వర్షం పడుతున్న సమయంలో ప్రజలు ఎవరు కూడా చెట్ల కింద ఉండరాదని సూచించారు.

ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ పద్మజ రాణి, CPO గోవింద రాజన్, శ్రీదేవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post