నారాయణపేట లో తీరొక్క పువ్వులతో చారిత్రక మెట్ల భారం బావి వద్ద అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

పూలను దేవతగా  పూజించే సంస్క్రితి మన  తెలంగాణ ప్రజలకు మాత్రమే సొంతమని అందుకే బతకమ్మ పండుగను రాష్ట్ర పండుగ గా జరుపుకుంటామని జిల్లా పరిషత్ చైర్మన్ వనజమ్మ అన్నారు.  గురువారం బతకమ్మ పండుగ రెండవరోజు నారాయణపేటలోని భారం బావి వద్ద అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి, ఎస్పీ డా. చేతన, మున్సిపల్ చైర్మన్ ఇతర ప్రముఖుల తో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ  పూలను ముఖ్యంగా తంగేడు, నునగా, బంతి ఇలా తీరొక్క పూలను అమర్చి పసుపు, కుంకుమతో దేవతలుగా పూజిస్తామని అన్నారు.  ఇటువంటి సంప్రదాయం మన తెలంగాణలో మాత్రమే నిర్వహించడం గొప్ప విషయంగా పేర్కొన్నారు.  ప్రతి ఒక్కరు బతుకమ్మ వలే సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేవతలను అందరు పూలతో పూజిస్తారని, తెలంగాణ ప్రజలమైన మనం పూలనే దేవతగా పూజిస్తామన్నారు.  కరోనా తర్వాత బతుకమ్మ వేడుకలను తొలిసారి నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.  నారాయణపేటలో ప్రకృతి సిద్ధమైన పురాతన అద్భుతమైన మెట్ల బావులు 45 ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.  వాటిలో  నుండి ఈ సారి  భారం బావిని ఎంచుకొని ఇక్కడ బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. నీటిని జల్ జీవన్ గా కోలస్తామని నీటి సంపదను కాపాడుకొని భూగర్భ జలాలను సంరక్షించుకొని జీవకోటి ప్రాణులకు జావనాధారంగా  నిలిపేందుకు ఈ పురాతన బావులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమం రాబోయేరోజుల్లో మరింత సాంప్రదయబద్ధంగా ఘనంగా జరుపుకునేందుకు ఈ వేడుకలు ఒక వేదిక కావాలని తెలిపారు.   ఈ నెల 13 వరకు ప్రతిరోజు బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం జరుగుతుందన్నారు.  జిల్లా ప్రజలకు మహిళలకు నవరాత్రి, దసరా , బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమించే పండుగ బతుకమ్మ పండుగ అని ఇలాంటి మహత్తరమైన పండుగను తెలంగాణ రాక ముందు ఆదరణ కారువయ్యిందని తెలిపారు. తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ గా జరుపుకుంటున్నామన్నారు. వన దేవతలు మా కుటుంబాన్ని చల్లగా దీవించాలని మహిళలు భక్తిశ్రద్ధలతో తీరొక్క పూలను సమకూర్చి దేవతగా కొలిచి పూజిస్తారని బతుకమ్మ పండుగ ప్రత్యేకతను అభివర్ణించారు.  రాష్ట్ర ప్రభుత్వం పండుగకు 18 సంవత్సరాలు నిండిన మహిళలకు కానుకగా కొత్త బట్టలను అందించడం జరిగిందని తెలియజేసారు.  జిల్లా ప్రజలు అందరు పండుగను సంతోషంగా జరుపుకోవాలని నవరాత్రి, దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్పీ డా. చేతన మాట్లాడుతూ పూలు చాలా కోమలంగా ఉంటాయని మహిళలు సైతం కోమలంగా ఉంటారని అదే మహిళలు దుర్గా మాత ఆది పరాశక్తి రూపం దాల్చి శత్రువులను సంహరిస్తుందని ఇదే సందేశాన్ని బతుకమ్మ పండుగ ఇస్తుందని తెలియజేసారు.  మూడు పువ్వులు ఆరు కాయలు అని అభివర్ణిస్టారని అంటే పూలు అనేక గింజలకు వేదిక అవుతుందని పేర్కొన్నారు.

అంతకుముందు భారం బావి దగ్గర దేవాలయంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ, శాసన సభ్యులు సతీమణి, మమతా అనురాగ్ శర్మ, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గందే అనసూయ మహిళలు అందరూ భక్తి శ్రద్ధతో తీరొక్క పువ్వులతో బాటుకమ్మలను అందంగా కూర్చారు.  అక్కడి నుండి నెత్తిన ఎత్తుకొని అంగరంగ వైభవంగా భారం బావి వద్దకు ర్యాలీగా వెళ్లారు.  అక్కడ బావిలో ఏర్పాటు చేసిన భరత నాట్యం చూపరులను కనువిందు చేసింది.  ముందుగా బావిలోని నీళ్లు, చుట్టూ దీపాలంకరణ, బతుకమ్మలు ప్రతి ఒక్కటీ సంప్రాధ్యాయకంగా ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది నేటి బతుకమ్మ సంబరాలు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గందే అనసూయ, ఆదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి, హైదరాబాద్ నుండి వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఈవెంట్ మేనేజర్ కల్పన, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, అండరూ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్దమొత్తంలో మహిళలు ప్రజలు పాల్గొన్నారు.

Share This Post