నార్కెట్ పల్లి పెద్ద చెరువు కబ్జా ” అనే శీర్షికతో ప్రచురించబడిన ప్రతికూల వార్తల విషయము పై రీజాయిండర్

ఎం‌పి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారి ఆరోపణలతో  వివిద దినపత్రికలలో తేదీ.26.05.2022న “నార్కెట్ పల్లి పెద్ద చెరువు కబ్జా ” అనే శీర్షికతో ప్రచురించబడిన ప్రతికూల వార్తలకి స్పందించి జిల్లా కలక్టర్ గారి అధెశానుసారం ఇరిగేషన్ ఈ ఈ  , ఏ డి  సర్వే మరియు రెవెన్యూ డివిజన్ అధికారి మరియు నార్కాటపల్లి తఃసీల్దార్  సంయుక్తంగా  పెద్ద చెరువు వాటి పరిసరాలు పరిశీలించి చెరువు లేవల్స్ ప్రకారము సర్వే జరిపి నిర్ణయించిన FTL ప్రకారము ప్రస్తుతము అడుసుమిల్లి  రాజా రావు మరియు వారి కుటుంబ సబ్యులు ఏర్పాటు చేయుచున్న  లే ఔట్ యొక్క  సర్వే నెంబరు వారీగా వివరములు ఈ క్రింది విదముగా ఉన్నవి. 534,538,539,540,546,547,548,549,489,490 సర్వే నంబర్లలో మొత్తం 38.15 ఎకరాలలో గల పట్టా భూమి కలదు. మొత్తం ఈ సర్వే నెంబర్లు వీటి విస్తీర్ణాలు FTL మరియు buffer zone పరిధి లోకి రావడం లేదు.పైన పేర్కొన్న సర్వే నంబర్లలో  ప్రభుత్వ భూమి ఏది లేదు .
  వివిద పత్రికలలోని ప్రతికూల వార్తలు FTL జాయింట్ సర్వే  నివేదిక ప్రకారము వాస్తవాలు కాదు అని తెలినది.
*జిల్లా కలెక్టర్*  *నల్లగొండ*

Share This Post