నిజాం చెరువును సుందరంగా తీర్చిదిద్దాలి…

ప్రచురణార్ధం

నిజాం చెరువును సుందరంగా తీర్చిదిద్దాలి…

మహబూబాబాద్, అక్టోబర్29.

జిల్లా కేంద్రం నడిఒడ్డున ఉన్న నిజాం చెరువును సుందరంగా తీర్చిద్దేందుకు ట్యాంక్ బండ్ నిర్మాణం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

శుక్రవారం కలెక్టర్ నిజం చెరువు పనులను సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిజాం చెరువు సుందరీకరణ పనులు జాప్యం చేయరాదన్నారు.

970 మీటర్ల లో 530 మీటర్ల ట్యాంక్ బ్యాండ్ విస్తరణ పనులు పూర్తయ్యాయన్నారు.ఫుట్ పాత్ పనులు పూర్తిఅయ్యయన్నారు.

బండ్ పనులు 90 శాతం పూర్తి అయ్యాయన్నారు.
పూడిక తీత పనులు నీరు తగ్గగానే మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.

వర్షం వస్తే చెరువు లోని నీరు వెళ్లే విధానాన్ని మ్యాప్ ద్వారా తెలియజేయాలన్నారు. పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, కొమరయ్య, Trainee కలెక్టర్ అభిషేక్ అగస్త్య,డి.పి.ఓ రఘువరన్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, ఎడి సర్వేయర్ నర్సింహ మూర్తి,ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
————————————————————
జిల్లాపౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది

Share This Post