నిజామాబాద్ జిల్లా యందు 2021-23 (A4 shop) మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తుల స్వీకరణ

ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా నిజామాబాద్ జిల్లా యందు 2021-23 (A4 shop) మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తుల స్వీకరణ గురువారంతో(18.11.2021) ముగిసింది. మొత్తం 102 దుకాణాలకు (1672అప్లికేషన్లు వచ్చినవి) నూతన లైసెన్స్ మంజూరు కొరకు శనివారం (20.11.2021) జరగబోయే లక్కీ డ్రా నిర్వహించే వేదిక: రాజీవ్ గాంధీ ఆడిటోరియం ,తిలక్ గార్డెన్, నిజామాబాద్ యందు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు శుక్రవారం పరిశీలించారు.
రేపు జరగబోయే కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర గారు మరియు నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నందగోపాల్ గారు,మరియు ఎక్సైజ్ సి.ఐ సాయన్న గారు పాల్గొనడం జరిగింది.
దరఖాస్తు దారులుకు గమనిక: రేపు జరగబోయే లక్కీ డ్రా కు 10:00am. వరకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో తప్పనిసరిగా దరఖాస్తుదారులు హాజరు కాగలరు. గౌరవ కలెక్టర్ గారు 11:00am కి డ్రా తీయడం జరుగుతుంది.
లక్కీ డ్రా లో షాప్ దక్కించుకున్న లైసెన్స్ దారుడు లైసెన్స్ ఫీస్ (1st instalment) పే చేయవలెను.అందుకు ఆడిటోరియంలో బ్యాంక్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది.ఉన్నతాధికారులు సూచన మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
గమనిక: దరఖాస్తుదారుల వాహనాల పార్కింగ్ కొరకు district eduction office(DEO office) , తిలక్ గార్డెన్ లో ఏర్పాటు చేయడం జరిగింది.

 

Share This Post