నిన్న అభయం…. నేడు ఆచరణ… -24 గంటల్లోనే అమలైన మంత్రి శ్రీ కేటీఆర్ హామీ

నిన్న అభయం….
నేడు ఆచరణ…

-24 గంటల్లోనే అమలైన మంత్రి శ్రీ కేటీఆర్ హామీ

– నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న కలెక్టర్

——————————-

కొనరావుపేట మండలం బావుసాయి పేట గ్రామానికి చెందిన ఎల్లవ్వ నిన్న జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి శ్రీ తారకరామారావు కలెక్టరేట్లో కలిసింది.

సంవత్సరం క్రితం తన భర్త ఏక్సిడెంట్ లో చనిపోయాడు. ఆర్థిక కష్టాల్లో ఉన్నానంటూ ఒక్క బిడ్డతో బ్రతుకు భారంగా సాగుతుందని. ..నిలువ నీడ లేని తనకు
గూడు సౌకర్యం కల్పించాలంటూ గోడు వెళ్లబోసుకుంది.

ఎల్లవ్వ బాధలు విని చలించిన మంత్రి శ్రీ కే తారక రామారావు ఎల్లవ్వకు డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మాణం చేపట్టి ఇవ్వాలంటూ అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి సూచించారు.

మంత్రి ఆదేశాలను అందుకున్న జిల్లా కలెక్టర్ శుక్రవారం ఎల్లవ్వ స్వగ్రామం బావుసాయి పేట లో ఆమె స్వంత స్థలంలో డబుల్ బెడ్ రూం ఇంటి నిర్మాణ పనులను ప్రారంభం అయ్యేలా చూసారు. జిల్లా రెవెన్యూ బాధ్యులు టి శ్రీనివాస్ రావు, ప్యాకేజీ 9 కార్యనిర్వహక ఇంజనీరు శ్రీనివాస్ లు దగ్గరుండి మరి ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు.

నిర్మాణ పనులు ప్రారంభమైన ఫోటోలను చూసిన ట్విట్టర్ వేదికగా చూసిన మంత్రి తారక రామారావు వెల్ డన్ అనురాగ్ అంటూ అభినందించారు.

కష్టాల్లో ఉన్నానంటూ గోడు వెళ్ళబోసుకున్న వెంటనే పేద మహిళకు గూడు సౌకర్యం కు చొరవ తీసుకున్న మంత్రిని ట్విట్టర్ వేదికగా నెటిజన్లు , ప్రజలు అభినందిస్తున్నారు.

——————————–

 

Share This Post