పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్ నిబద్ధతతో సభ్యుల ఆశయాలకనుగుంగా పని చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ సభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ లో శనివారం అం ఏర్పాటుచేసిన పి ఆర్ టి యు 34వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిఆర్టియు అనే సంస్థతో తన అనుబంధం ఇప్పటిది కాదని తమ తండ్రి గారు ఉన్నప్పటి నుండి ఉన్నదన్నారు. లక్షా రెండు వేల మంది టీచర్లు ఉంటే అందులో 75 వేల మంది పి ఆర్ టి యు సభ్యులు ఉన్నారన్నారు. టీచర్ల ప్రయోజనాలు, వారి హక్కులు కాపాడుకోవడానికి, వాటిని పొందటానికి నిబద్ధతతో కలిసి పనిచేసే నాయకత్వం, అందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ఒకరికొకరు కలిసి పనిచేసే వ్యక్తులు ఈ సంఘంలో ఉన్నారని అన్నారు. తమ సభ్యులకు ఏ అవసరం వచ్చిన దానిని నెరవేర్చడానికి సంఘ ప్రతినిధులు అత్యంత నమ్మకంగా పని చేస్తారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రం కోసం నడిపించిన టీ ఉద్యమములో క్షేత్రస్థాయిలో చాలా మందితో కలిసి పనిచేసిన అందరం కలిసి పనిచేసిన ఎవరి స్థాయిలో వాళ్లు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఆనాటి ఉద్యమంలో కెసిఆర్ గారి వెంట నడిచిన వ్యక్తులం. ఆ ఉద్యమమే మిమ్మల్ని ఒక శక్తి గా రూపొందించింది అన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ మాట్లాడుతూ ఒక వ్యక్తి మంచి వాడు కావాలన్నా చెడ్డ వాడు కావాలన్నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ బాధ్యత టీచర్ల మీద ఉందన్నారు మంచిగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, ఒక ప్రయోజకుడు కావాలన్నా వందకు వంద శాతం టీచర్లు నేర్పించిన చదువే కారణమని అన్నారు ఉపాధ్యాయులు అంటే సీఎం కేసీఆర్ గారికి ఎంతో గౌరవం అన్నారు. మీకు ఉన్న సమస్యలను మీ నాయకుల ద్వారా ముఖ్యమంత్రి ముందు పెట్టిన ప్రతిసారి వీలైనన్ని మీ సంఘాల ప్రతినిధులతో చర్చించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సంఘం ఏదైనా ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టి వాళ్లను ప్రయోజకులుగా తీర్చిదిద్దడం అని సూచించారు
ఈ సమావేశంలో పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి శాసనమండలి సభ్యులు కాటేపల్లి జనార్దన్, శాసన మండలి సభ్యులు రఘోత్తం రెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్ మాజీ శాసన మండలి సభ్యులు పూల రవీందర్ పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు, పి ఆర్ టి యు నిజామాబాద్ అధ్యక్షులు మోహన్ రెడ్డి చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పిఆర్టియు నిజాంబాద్ కార్యదర్శి వెంకటేష్ గౌడ్ పిఆర్టియు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రవి కిరణ్ లేడీ అసిస్టెంట్ సెక్రటరీ రాధా లతా, ఆశా రాణి రాష్ట్రం నలుమూలల నుండి వచ్చినటువంటి 33 జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పిఆర్టియు ప్రతినిధులు పాల్గొన్నారు