నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, డిఐజి రంగనాధ్* – – నిమజ్జనం ప్రాంతాలలో అధికారులకు పలు సూచనలు – – క్రేన్లు, గజ ఈతగాళ్లు, ఫ్లడ్ లైట్ల ఏర్పాటు – – అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

నల్లగొండ : ఆదివారం జరగనున్న గణేష్ నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డిఐజి రంగనాధ్ తెలిపారు.
గణేష్ నిమజ్జనం జరిగే నల్లగొండ పట్టణంలోని వల్లభరావు చెరువు, 14వ మైలు రాయి వద్ద చేసిన ఏర్పాట్లను వారు పరిశీలించి పలు సూచనలు చేశారు. నిమజ్జన ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రేన్లు, ఫ్లడ్ లైట్లు, బారికేడింగ్ ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు.నిమజ్జనం చెరువు,14 th మైల్ వద్ద పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనం ఆదివారం సాయంత్రం నుండి సోమవారం తెల్ల వారు వరకు జరుగనున్నందున ఆర్.డి.ఓ.లు,డి.ఎస్.పి.లు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. పటిష్ట బందోబస్తుతో పాటు సమయాన్ని పాటిస్తూ మండపాల నిర్వాహకులు గణేష్ విగ్రహాల నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదే విధంగా విద్యుత్, రెవిన్యూ, ఆర్ అండ్ బి, పంచాయితీ, పోలీసుతో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నిమజ్జన శోభాయాత్ర, నిమజ్జనం జరిగే విధంగా ప్రతి ఒక్కరూ జిల్లా యంత్రాంగంతో సహకరించాలని వారు కోరారు.
వారి వెంట నాగార్జున సాగర్ శాసనసభ్యుడు నోముల భగత్, మిర్యాలగూడ, నల్లగొండ ఆర్డీఓలు రోహిత్ సింగ్, జగదీశ్వర్ రెడ్డి, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,నల్గొండ ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, హాలియా మున్సిపల్ కమిషనర్ వేమారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ పిల్లి రామరాజు, సిఐలు బాలగోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, చీర్ల శ్రీనివాస్, టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులు, మున్సిపల్, రెవిన్యూతో పాటు వివిధ శాఖల అధికారులున్నారు.

Share This Post