నిమ్నజాతులు, కులాలను భూస్వాముల నుండి విముక్తి కోసం, తెలంగాణ సాయుధ పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ పోరాటపటిమ ప్రతిఒక్కరికి సూర్తి కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి . అజయ్ కుమార్ అన్నారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు 26 ఖమ్మం:

నిమ్నజాతులు, కులాలను భూస్వాముల నుండి విముక్తి కోసం, తెలంగాణ సాయుధ పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ పోరాటపటిమ ప్రతిఒక్కరికి సూర్తి కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వున్నాడు. అజయ్ కుమార్ అన్నారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్ లో నిర్వహించిన వీరవనిత చాకలి ఐలమ్మ. 126 వ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో  కలిసి పూలమాలవేసి చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయించిందని, మొట్టమొదటి సారిగా చాకలి ఐలమ్మ 126 వ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించుకుంటున్నామని మంత్రి తెలిపారు. దేశముఖ్ లు, రజాకారులు, భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వీరవనిత పాత్ర చరిత్రలో నిలిచిపోయిందన్నారు. తక్కువ కులాల వారు వ్యవసాయం చేయకూడదన్న భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటపటిమను కనబర్చి తెలంగాణ సాయుధ పోరాటయోధురాలుగా చాకలి ఐలమ్మ నిలిచారని మంత్రి అన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, బిసి సంక్షేమంలో భాగంగా నగర నడిబొడ్డులో విలువైన 2 వేల గజాల స్థలంలో 2 కోట్ల వ్యయంతో బి.సి భవన్ నిర్మాణం చేపట్టామని, రజకుల ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్తో పాటు నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. వెనుకబడిన వర్గాలు కూడా గౌరవ ప్రదంతో జీవించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రివర్యుల ఆకాంక్ష అని మంత్రి తెలిపారు. జిల్లాలో 3205 మంది రజకుల లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్ కింద కొత్త మీటర్లను అమర్చడం జరిగిందని, అదేవిధంగా ఇప్పటివరకు 1216 మంది నాయిబ్రాహ్మణుల సెలూన్ల నిర్వహణ నిమిత్తం రిజిస్ట్రేషన్ చేసుకొనగా 593 మందికి కొత్త కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. లకారం ట్యాంక్ బండ్  పై  తన స్వంత ఖర్చులతో మడేల్ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టింపచేసామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ గొప్ప మహిళగా నిలిచారని, వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం, తెలంగాణ సాయుధ పోరాటం చేసి సాయుధ పోరాట యోధురాలుగా నిలిచారన్నారు. తన ప్రాణాలను తెగించి కుటుంభ సభ్యులను త్యాగం. చేసి తన జీవితాన్ని అంకితం చేసారని, గొప్ప వీరవనితను స్మరించుకోవడంతో పాటు ఆమె పుట్టిన తెలంగాణాలో పనిచేయడం గొప్ప సదవకాశమని వారి జీవితం ప్రతి ఒక్కరికి స్పూర్తి కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు.

శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బడుగు, బలహీన, అణగారిన వర్గాలకోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించుకునేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్ని ఆయన అన్నారు.తెలంగాణ కోసం జాతికోసం సాయుధ పోరాటం కోసం పోరాటాలు జరిపిన అన్ని వర్గాల నాయకులను మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తున్నదని బాలసాని లక్ష్మీనారాయణ తెలిపారు.

చాకలి ఐలమ్మ సాధనసమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలక్ష్మి, రజక సంఘాల సమితి రాష్ట్ర కో-కన్వినర్ తిమ్మారపు బ్రహ్మయ్య మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన ఘట్టాలను వివరించారు. అదేవిధంగా జిల్లాలో బి.సి వర్గాల కొరకు ప్రభుత్వ పరంగా ఇంకనూ కావలసిన సదుపాయాల ఏర్పాట్లను మంత్రి దృష్టికి తెచ్చారు.

నగరమేయర్ పునుకొల్లు నీరం, పోలీసు కమీషనర్ విష్ణు యస్.వారియర్, జిల్లా పరిషత్ చైర్మన్: లింగాల కమలరాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డి.సి.సి. బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, బి.సి సంక్షేమ శాఖాధికారి శ్రీమతి జ్యోతి, రాష్ట్ర రజక సంఘం ఉపాధ్యక్షులు యస్. వెంకటేశ్వర్లు, రాష్ట్ర రజక సంఘం మహిళా ప్రధాన కార్యదర్శి పి. క్రిష్ణవేణి, జిల్లా బి.సి. అధ్యక్షులు పిండిప్రోలు రామమూర్తి, జిల్లా రజకసంఘం అధ్యక్షులు మరుపల్లి బుజ్జి, జిల్లా రజక సంఘం అధ్యక్షులు దుంపటి నగేష్, రజక సంఘం నాయకులు జక్కుల లక్ష్మయ్య, రజక వృత్తిదారుల సంఘం నాయకులు సత్తెనపల్లి శ్రీను, జిల్లా, యువ రజక సంఘాల నాయకులు బొడ్డు ఉపేందర్, రజక సంఘం నాయకులు కె.ఉపేందర్, రేగళ్ళ కొండల్రావు, జక్కుల వెంకటరమణ, యస్. వెంకటేశ్వర్లు, కార్పోరేటర్లు, జిల్లా అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post