ప్రచురునార్ధం
వరంగల్ జిల్లా
నియమ నిబంధనలకు లోబడి పరీక్షలు జరగాలి :: కలెక్టర్ పి. ప్రావీణ్య
బుధవారం రోజున గీసుకొండ మండలం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల నిర్వహణ తీరు ను జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆకస్మికంగా పరిశీలించారు
పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు
విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు
జిల్లాలో మొత్తం 27 పరీక్షా కేంద్రాలు ఉన్నాయని , బుధవారం రోజున జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ప్రశాంతంగా ముగిసిందని, ప్రభుత్వ నియమ నియమ నిబందనలకు లోబడి పరీక్షలు నిర్వహించడం జరిగినదని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి పి.మాధవరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
ఈరోజు జరిగిన పరీక్ష కేంద్రానికి హాజరు కావలసిన మొత్తం విద్యార్థుల సంఖ్య 7132 కాగా
పరీక్ష కేంద్రానికి హాజరు అయిన విద్యార్థులు 6357 అని, హాజరు కానీ విద్యార్థులు 775 ఉన్నారని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి పి. మాధవ రావు తెపిపారు.