నిరంతర వైద్య సేవలoదిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 27: నిరంతర వైద్య సేవలoదిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. బుధవారం జనగామ చంపక్ హిల్స్ లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని(ఎం సి హెచ్) జిల్లా వైద్యాధికారి ఏ. మహేందర్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాస్పిటల్ ఆవరణం కలియ తిరుగుతూ ప్రసవం కోసం వచ్చిన గర్భీణీలతో మాట్లాడుతూ వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు డాక్టర్ సుగుణాకర్ రాజును అడిగి తెలుసుకొని, ఆస్పత్రికి వచ్చే వారికి నిరంతరo వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి రాత్రుల్లు కూడా ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని, నాణ్యమైన వైద్య సేవలు అందించి అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. ఆస్పత్రి లో అందుతున్న సేవల యొక్క వివరాలు తెలుసుకునేందుకు ప్రజలకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో ప్రసవం అయిన వారికి ప్రభుత్వం నుండి కల్పించే కె.సి.ఆర్ మెడికల్ కిట్లను గర్భీణీలకు అందజేశారు. ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రికి పంపరాదని సంబంధిత అధికారులను ఆదేశించి, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ తనిఖీలో జిల్లా వైధ్య ఆరోగ్యాధికారి డాక్టర్ ఏ. మహేందర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. సుగుణాకర్ రాజు, డాక్టర్స్ అంబిక, స్వప్న, అనిరుద్ రావ్, శ్రీనివాస్, పంకజ్ కుమార్ ఉన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారి చేయనైనది.

Share This Post