నిరాడంబరంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు :: జిల్లా కలెక్టర్ జి. రవి

నిరాడంబరంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం-1                                                                                                                                                                                                                                                     తేదిః 12-08-2021

                                                                నిరాడంబరంగా  స్వాతంత్ర్య  దినోత్సవ వేడుకలు :: జిల్లా కలెక్టర్ జి. రవి

          జగిత్యాల, అగస్టు 12:  స్వాతంత్య్ర దినోత్సవ  సందర్బంగా జిల్లా కేంద్రంలోని ఖీల్లాలో నిర్వహించనున్న వేడుకలను కోవిడ్ 19  వైరస్ నేపథ్యంలో  నిరాడంబరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.  గురువారం  జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చేపట్టనున్న ఏర్పాట్ల పై శాఖల వారిగా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,  స్వాతంత్యం దినోత్సవం రోజున హైదరాబాద్ లోని గోల్కోండ కోటలో పతాకావిష్కరణ గావించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు  రాష్ట్రం మొత్తం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల పై ప్రభుత్వ ఆదేశాలు జారి కావాల్సిఉన్నాయి. జగిత్యాల ఖీల్లాలో నిర్వహించనున్న కార్యక్రమాలకు అధికారులు వారివారి శాఖల తరపున కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, ఖిల్లా పరిసరాలను, గ్రౌండ్ ను పరిశుభ్రం చేయించాలని, శామియానాలు, విఐపి లకు ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లను చేయాలని, అధికారులతో పాటు, కార్యక్రమ విక్షించడానికి వచ్చిన వారికి సైతం ఇబ్బందులు లేకుండా సీటింగ్, షామియాలను అదనంగా ఏర్పాటు చేయించాలని అన్నారు.  మంచినీటి కూడా ఎర్పాటు చేయాలని, ఖీల్లాలో ప్లాస్టిక్ వాటర్ ప్యాకేట్లను అనుమతించరాదని, పేపర్ గ్లాసులు, వాటర్ బాటీల్స్ వాడేలా చూడాలని తెలియజేశారు.  పతాకావిష్కరణ అనంతరం విద్యార్థులు డ్యాన్స్ కార్యక్రమంలో బృందంగా 20కి తగ్గకుండ ఉన్నవారి కార్యక్రమాన్ని మాత్రమే అనుమతించాలని, ఆహ్వనాల పంపిణి సరిగా జరిగేలా కలెక్టర్ కార్యాలయ అధికారులు చూడాలని,  వివిధ శాఖల ద్వారా లబ్దిదారులకు పంపిణి చేయవలసిన ఆస్తుల పంపిణి కార్యక్రమాల వివరాలను ముందుగానే తెలియజేయాలని, శాఖల ద్వారా ఏర్పాటు చేయబోయో స్టాల్లలో, ఇప్పుడు నడిచే కార్యక్రమాలకు అధిక ప్రాదాన్యం ఇవ్వాలని,  సిబ్బందికి అందించే ప్రసంసాపత్రాల కొరకు శాఖల వారిగా సిబ్బంది వివరాలను తెలియజేయాలని, రిప్రెష్ మేంట్ ఏర్పాట్లకు తహసీల్దార్ అర్బన్, రూరల్ అధికారులు బాద్యత వహించాలని,  ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసు అదికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మెడికల్ క్యాంప్ డాక్టర్ తో కూడిన ఏర్పాటు , అంబులెన్స్, అన్ని మెడికల్ వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అందరు మాస్కులు, సామాజిక దూరాన్ని పాటించాలని ఆదేశించారు.

ఈ కార్యకమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జే. అరుణశ్రీ, కోరుట్ల ఆర్డిఓ టి. వినోద్ కుమార్,  జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి ఆర్.డి. మాదురి, డిఆర్డిఓ పిడి  ఎస్. వినోద్, జగిత్యాల డిఎస్పిలు  ప్రతాప్, వెంకటరమణ లతో పాటు వివిధ శాఖాధిపతులు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

నిరాడంబరంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు :: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post