నిరాశ్రయ బాలలను సంరక్షించాలి

నిరాశ్రయ బాలలను సంరక్షించాలి

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

0 0 0 0

 

       జిల్లాలో నిరాశ్రయులగా ఉన్న బాలలను అక్కున చేర్చుకొని సంరక్షించాలని జిల్లా స్థానిక  సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.

 

      

 

    జిల్లా కేంద్రంలోని 59వ డివిజన్ లో ప్రభుత్వ,  ప్రభుత్వేతర ఎన్ జి ఓ లు సంయుక్తంగా నిర్వహించనున్న బాలుర ఓపెన్ షెల్టర్ భవనాన్ని జడ్పీ సిఈఓ, ట్రైని కలెక్టర్ లతో కలిసి స్థానిక  సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ,  జిల్లాలో తప్పిపోయిన, బిక్షాటన చేస్తున్న, నిరాశ్రయులుగా మిగిలిన 6 నుండి 18 సంవత్సరాల లోపు బాలికల కొరకు ఇప్పటికే సంరక్షణ కేంద్రాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని, జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మరియు ఆప్తమిత్ర స్వచ్చంద సేవా సమిటి అద్వర్యంలో బాలుల కోసం సంరక్షణ కేంద్రాన్ని గురువారం ప్రారంభించు కోవడం జరిగిందని పేర్కోన్నారు.  కేంద్ర సంరక్షణలో ఉన్న పిల్లల వివరాలను ఎప్పటికప్పడు రికార్డులలో నమోదు చేయాలని ఈ కేంద్రాలకు వచ్చే వారికి నాణ్యమైన విద్య, ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.  కార్యక్రమంలొ చివరగా సంరక్షణ కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

 

          ఈ కార్యక్రమంలో జడ్పీ సిఈఓ  ప్రియాంక, ట్రైని కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో,  కార్పోరేటర్ గందెమాదవి, జిల్లా సంక్షేమ అధికారి సబితా, జిల్లా వైద్యాధికారి డాః జువేరియా, ఆర్గనైజ్ నిర్వహకుడు కనకరాజు తదితరులు పాల్గోన్నారు.

Share This Post