ప్రెస్ రిలీజ్
జనగాం జిల్లా, నవంబర్ – 29.
ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పై నిరుద్యోగులకు అవగాహన సదస్సు
మంగళవారం నాడు జనగామ జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సదస్సుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 100 మంది అభ్యర్థులు హాజరై పథకం యొక్క వివరాల వివిధ రంగాలలో గల ఉపాధి అవకాశాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ అభ్యర్థులు వివిధ పథకాలు ఎంచుకొని స్వయంకృషి ద్వారా ఎదగాలన్నారు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ మరియు బ్యాంకుల ఆర్థిక సహాయంతో యూనిట్ల నిలుపుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఉపాధి పథకం మార్గదర్శకాలు వివిధ ప్రాజెక్టు అవకాశాలు విజయగాధలు తదితరాంశాలపై జిల్లా పరిశ్రమల అధికారి కే.రమేష్ వివరించారు. మరిన్ని వివరాలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల కేంద్రం రూమ్ నెంబర్ (ఎస్ 18) లో సంప్రదించాలని ఆయన చెప్పారు
ఈ కార్యక్రమంలో కెవిఐబి రీజినల్ మేనేజర్ అశోక్ కుమార్, లీడ్ బ్యాంకు అధికారి శ్రీధర్, ఎస్బిఐ శిరీష, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకన్న, బీసీ డెవలప్మెంట్ అధికారి రవీందర్, మెప్మా పీడీ హర్షవర్ధన్, డిక్కీ కోఆర్డినేటర్ రాజేశ్వరి, జనగామ మండలం పరిషత్ అధ్యక్షులు కళింగరాజు, తదితరులు పాల్గొన్నారు