నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి-రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో 20 లక్షల రూపాయల తో నిర్మించిన పల్లె ప్రకృతి వనం,పిల్లల ఆట స్థలము,ఆరున్నర లక్షల రూపాయల తో ఏర్పాటు చేసిన కంటైనర్ గ్రంథాలయం ఆరు లక్షల పై చిలుకు నిధుల తో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు,25 లక్షలతో గుంతను పూడ్చి చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు,5 లక్షల తో ఓపెన్ జిమ్ లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రువర్యులు పీ. సబితా ఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్తు ఛైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యే కాలే యాదయ్యలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జాబ్ మేళా అవకాశాలను సద్వినియోగ పరుచుకొని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు గ్రంథాలయాన్నిసద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రంగారెడ్డి జిల్లాలో ప్రతి జిల్లా పరిషత్ పాఠశాలలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని ,10 కోట్ల తో జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ ఏర్పాటులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద కౌకుంట్ల గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు. వివిధ రంగాల్లో ఇప్పటి వరకు లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. త్వరలో 50 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కృషి చేయనున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో వివిధ ఫ్రైవేట్ కంపెనీలలో 11 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. జిల్లాలోని శంకర్ పల్లి, చేవెళ్ల, కందుకూరు , మహేశ్వరం మండలాల్లోని నిరుద్యోగ యువతకు జాబ్ మేళాలను ఏర్పాటు చేసి 2,130 మంది అభ్యర్థులకు ఉద్యోగాలను నేరుగా ఉపాధి కల్పించడం జరిగిందని, 340 మంది అభ్యర్థులు వివిధ రంగాల్లో శిక్షణ పొందు తున్నారని, వారికి శిక్షణ అనంతరం ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో అమెజాన్, ఆక్సిస్ బ్యాంక్, హెచ్.డీ.ఎఫ్.సీ, జెన్ ప్యాక్, గూగుల్, టెలిపెర్ఫామెన్స్, రిలయన్స్ ట్రెండ్స్ సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన జాబ్ మేళా లో ఎంపికైన వారికి నియామక పత్రాలను లను మంత్రి అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ , జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండు, డీసీఎంఎస్ చైర్మన్ క్రిష్ణారెడ్డి, జిల్లా విద్యాధికారి సుసిందర్ రావు, డీ.ఆర్డీ ఏ పీ.డి ప్రభాకర్, ఎంపీ డీ ఓ హరీష్, జడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి , ఎంపీపీ విజయ లక్ష్మి రమణ రెడ్డి , సర్పంచ్ గాయత్రి సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post