నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగ పరచుకోవాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 16, 2021ఆదిలాబాదు:-

నిరుద్యోగ యువతకు పరిశ్రమల శాఖ ద్వారా ఉపాధి కల్పనకు ప్రభుత్వం వివిధ పథకాలను పెట్టి అమలుపరుస్తున్నదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిఎస్-ఐ పాస్ ద్వారా ఐదు పరిశ్రమల స్థాపనకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమలు 2.12 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం తో పాటు 29 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధిత శాఖల ద్వారా అనుమతులు రావడం జరిగిందని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ఏడు దరఖాస్తులు రాగా, అన్ని అనుమతులు ఉన్నందున ఐదు పరిశ్రమల ఏర్పాటుకు మంజూరు ఇస్తున్నట్లు, పలు కారణాల వలన రెండు దరఖాస్తులు తిరస్కరించడం జరిగిందని తెలిపారు. టి-ప్రైడ్ పథకం క్రింద 16 మంది షెడ్యూల్డు కులాల తేగల వారికీ 41.77 లక్షల రూపాయలు ట్రాస్పోర్ట్ సర్వీస్ లకు  సబ్సిడీ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో షెడ్యూల్డు కులాలకు చెందిన ముగ్గురు, షెడ్యూల్డు తేగల వారు 13 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. పావలా వడ్డీ కింద రవాణా సర్వీస్ కొరకు ఒక షెడ్యూల్డు కులాల మహిళకు 17 వేల రూపాయల సబ్సిడీ మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు, LDM చంద్రశేఖర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, ఇంచార్జ్ CTO కే.గోదావరి, సహాయ రవాణా అధికారి డి.శ్రీకాంత్, విద్యుత్ శాఖ ఎడి డి.ప్రశాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post