నిరుద్యోగ సమస్య తీర్చటానికి కృషి. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉద్యోగ,ఉపాధి కల్పన కు చర్యలు తిసుకుంటున్నాం-విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు జాబ్ మేళా లో 758 మంది ఎంపిక అవ్వగా అప్పటికప్పుడే 538 మంది నేరుగా ఉద్యోగాలు పొందగా వారికి మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు మంత్రి అందజేశారు. 218 మంది 3 నెలల శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో జాయిన్ అవుతారని అన్నారు.
గతంలో మహేశ్వరం లో నిర్వహించిన జాబ్ మేళా లో 782 మంది ఎంపిక అవ్వగా నేరుగా 462 మంది ఉద్యోగాలు పొందగా, 320 మంది 3 నెలల శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో జాయిన్ అవుతారని మంత్రి తెలిపారు.
మహేశ్వరం నియోజకవర్గం,కందుకూరు మండల పరిధిలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఎంపిక అయిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసి ఈ సందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Share This Post