నిరుపేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేటాయించనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు.

నిరుపేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేటాయించనున్న  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు.  జిల్లాలో ఇప్పటి వరకు పూర్తి అయిన డబుల్ బెదరూమ్ ఇళ్లు అచ్ఛంపేట, కల్వకుర్తి, పెద్దముద్దనూర్ లో వెరసి 420 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేటాయించేందుకు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరడం జరిగింది. రేపు  సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉన్నప్పటికిని ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను ప్రింట్ అవుట్ తీసుకొని ఏ విధమైన నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలో సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు.  ఒక్కో మిన్సిపాలిటీలో ఇప్పటి వరకు దాదాపు 400 నుండి 500 వరకు దరఖాస్తులు వచ్చాయని వాటిని ప్రింట్ తీసుకొని ముందుగా మున్సిపాలిటీ వారిగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వార్డు వారిగా ఏర్పాటు చేసుకున్న కమిటీలు తమ వార్డుకు సంబంధించిన దరఖాస్తులు తీసుకొని ముందుగా టేబుల్ వర్క్ చేసుకోవాలని సూచించారు.  ఇందులో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారు, ప్రాపర్టీ రిపోర్ట్ ఆధారంగా   ప్రస్తుతం వారి నివాసం  కచ్చా భవనం లేదా గుడిసె లేదా అద్దె ఇల్లు అనే వివరాలు రూఢి చేసుకోవాలన్నారు.  ఇప్పటి కారకు ఇందిరమ్మ ఇల్లు లేదా మరే ఇతర గృహ పథకంలో లబ్ది పొంది ఉండరాదన్నారు.  అనంతరం  సెలెక్షన్ కమిటీలు గృహ సందర్శన చేసి ఖచ్చితమైన పకడ్బందీ నివేదిక తయారు చేసి గ్రామ సభ ద్వారా తీర్మానం చేయాలని  తెలిపారు.  కమిటీ ద్వారా రూపొందించిన జాబితాను రెవెన్యూ అధికారులు ర్యాటిఫై చేయాల్సి ఉంటుందని చెప్పారు.  రేపు సాయంత్రం లోగా 80 శాతం టేబుల్ వర్క్ పూర్తి కావాలని సూచించారు. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా ఉండాలని, ఎంపికలో రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాలని మైనార్టీలకు 7 శాతం రిజర్వేషన్, ఒంటరి మహిళలు, దివ్యంగులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని తెలియజేసారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆదనవు కలెక్టర్ మను చౌదరి, ఆదనవు కలెక్టర్ రెవెన్యూ మోతిలాల్, ఆర్డీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

Share This Post