నిరుపేదలైన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అందరు సద్వినియోగం చేసుకొని మంచి విద్యా బుద్దులతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు

నిరుపేదలైన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అందరు సద్వినియోగం చేసుకొని మంచి విద్యా బుద్దులతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు

నిరుపేదలైన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అందరు సద్వినియోగం చేసుకొని మంచి విద్యా బుద్దులతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. సోమవారం తన ఛాంబర్ లో గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాల (B.A.S) లో ప్రవేశాల కోసం విద్యార్థుల ఎంపికను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను బోధించడంతో పాటు వారికి అవసరమైన భోజన, వసతి సౌకర్యాలను కూడా పూర్తిగా ఉచితంగా కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాదించి సమాజంలో ముందు స్థానంలో ఉండాలని ఆయన సూచించారు.
లక్కి డిప్ ద్వారా ఎంపికైన విద్యార్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి… మూడవ తరగతి బాలికలలో అజ్మీర సాయి గాయిత్రి, కడావత్ శ్వేత. భాలురలో నున్సవాత్ శరత్, కేతవాత్ కార్తీక్, ధరావత్ చేతన్ కృష్ణ. ఐదవ తరగతి బాలికలలో నున్సవాత్ కౌషిక భాలురలో లకవాత్ దీరేష్ ఎంపిక కాగా, ఎనిమిదవ తరగతి బాలికలలో మూడ్ జీవిత, బాలురలో రాట్ల మనోజ్ కుమార్, రామవాత్ శ్రీధర్ బాబు లు టెస్ట్ అవైలబుల్ పాఠశాలకు ఎంపిక అయినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి బి. కేశురాం తో పాటు వసతి గృహ సంక్షేమ అధికారి టి. జయరాజ్, కార్యాలయ సిబ్బంది జి. లక్ష్మీనారాయణ, జి. శ్రీకాంత్, పి. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post