ప్రచురణార్థం
మహబూబాబాద్ మార్చి 25.
నిరుపేదలకు నిలువ నీడ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి సొంతింటి కల ను నెరవేర్చిన మహానుభావుడు కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ కొనియాడారు.
శనివారం జిల్లా కేంద్రం లోని గిరిజన భవన్ లో మహబూబాబాద్ తాసిల్దార్ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలో 58 , 59 ప్రభుత్వ ఉత్తర్వుల నిబంధనలతో ప్రభుత్వ భూమిలోని ఇళ్లకు క్రమబద్ధీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ శశాంక మహబూబాబాద్ శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి లతో కలిసి మంత్రి అర్హులైన నిరుపేదలకు పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …
నిరుపేదలకు నిలువ నీడ కల్పించాలనే గొప్పఉద్దేశంతో ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి సొంతింటి కల ను నెరవేర్చిన మహానుభావుడు కేసీఆర్ అని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
పట్టాలు రానివారు ఆందోళన చెంద రాదని అన్నారు. పన్నుల చెల్లింపులు తో అభివృద్ధి వేగవంతంగా ఉంటుందని రోడ్లు త్రాగునీరు విద్యుత్ సౌకర్యాలు తప్పనిసరిగా కల్పిస్తామన్నారు.
అర్హులైన నిరుపేదల అందరికీ పట్టాలందుతాయని వలస వచ్చిన వారిని ప్రోత్సహించరాదన్నారు. త్వరలోనే సమగ్ర సర్వే చేపడతామని అందరికీ మేలు జరుగుతుందన్నారు పట్టణం నాలుగు వైపులా జాతీయ రహదారులు వస్తున్నాయని పట్టణ అభివృద్ధి వేగవంతంగా జరుగుతున్నదని ప్రభుత్వ అవసరాలకు కూడా ప్రభుత్వ భూమి అవసరం ఉందని ప్రజలు గుర్తించుకోవాలన్నారు.
350 పడకల ఆసుపత్రిగా ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకున్నామని త్వరలో మెడికల్ కళాశాల పూర్తిస్థాయిలో రూపుదిద్దుకొని నిరుపేద ప్రజలకు ఆధునిక వైద్య సౌకర్యాలతో అందుబాటులోకి రానున్నది అన్నారు.
జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ… జీవో 58 నిబంధనల మేరకు
125 గజాల వరకు నిరుపేదలకు ఉచితంగా క్రమబద్ధీకరణ జరుగుతుందన్నారు.
అంతకుమించిన ఇంటి స్థలానికి 59 క్రింద క్రమబద్ధీకరణ చేపడుతున్నందున ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. 59 ప్రభుత్వ ఉత్తర్లు కింద 9 మందికి పట్టాలు చేయడం జరిగిందన్నారు ఈ పట్టాలు ప్రైవేట్ పట్టాకు సమానంగా అర్హత కల్పిస్తాయన్నారు.
మహబూబాబాద్ శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్ మాట్లాడుతూ…
నిరుపేదలు కడు బీదరికంతో ఎంతోకాలంగా స్థిర నివాసం ఉంటూ తాము ఉన్న ఇంటికే అనుమతి లేకపోవడం తమ ప్రభుత్వం పేదింటి కలను సాకారం చేయాలని దృడ సంకల్పంతో 58 59 ప్రభుత్వ ఉత్తర్వుల క్రింద నిబంధనలతో అర్హులకు న్యాయం చేయడం జరుగుతున్నది అన్నారు. మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు నిధుల కేటాయింపు జరుగుతున్నది అన్నారు 50 కోట్లతో మునిసిపాలిటీ లో అత్యవసరమైన పనులు చేపట్టి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి పరచామని మెడికల్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని దానితో పాటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరైనట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్ ఆర్ డి ఓ కొమరయ్య మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి తాసిల్దార్ నాగ భవాని కౌన్సిలర్లు మార్నేని వెంకన్న , పుష్పలత, శ్రీదేవి , ఫరీదా జిల్లా అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.